logo

*||జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు||* *-విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత*


79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలును జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఆగస్టు 15న జిల్లా పోలీసుశాఖ మనంగా నిర్వహించారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఎగుర వేసారు. అనంతరం,
అదనపు ఎస్పీ పోలీసు కార్యాలయ ఉద్యోగులు, పోలీసు అధికారులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి,చాక్లెట్లు పంచి పెట్టారు.
ఈ కార్యక్రమాల్లో డిపిఓ ఎ.ఓ. పి.శ్రీనివాసరావు, ఆర్ఎస్ఐలు ఎన్.గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, టి.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు వెంకటలక్ష్మి, పోలీసు కార్యాలయ ఉద్యోగలు మరియు ఇతర పోలీసు అధికారులు,
సిబ్బంది పాల్గొన్నారు.

5
821 views