logo

ఇస్కాన్ పర్యాటక హబ్ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

ఇస్కాన్ పర్యాటక హబ్
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
ఇస్కాన్ విజయవాడ ఆధ్వర్యంలో రామలింగేశ్వర నగర్ శ్రీ జగన్నాథ్ మందిర్,
ఉండవల్లి కరకట్ట వద్ద శ్రీ రాధ శ్యామ్ సుందర్ మందిరాలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు ఆగస్టు 15,16 ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని జగన్నాధ్ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శివనాథ్, రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ ఇస్కాన్ మందిరాల వారు అనేక ' ఆధ్యాత్మిక ' సేవా కార్యక్రమాలు చేస్తుంటారని, భక్తుల ఆదరణతో నగరం భక్తితత్వాన్నీ పెంపొందిస్తూన్నారు. అందుకే విజయవాడ ఇస్కాన్ ఆధ్యాత్మిక పర్యాటక హబ్ గా రూపొందుతుందన్నారు. ముందుగా భక్తులకు, ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధారి దాస్ మాట్లాడుతూ శ్రీ కృష్ణ భగవానుడు సందేశమిచ్చిన భగవద్గీతలో
కలియుగం కష్టాల విముక్తికి కృష్ణ చైతన్య మార్గమే ముక్తి మార్గాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందన్నారు. జిల్లాలో సాంస్కృతిక నృత్యాల పోటీలు నిర్వహించగా వేలాదిమంది పాల్గొగనగా, అందరికీ సర్టిఫికెట్లు, విజేతలకు బహుమతులు అందిస్తున్నామన్నారు. ఆదివారం రాధ శ్యామ్ సుందర్ మందిరంలో జరిగే నందోత్సవం, వ్యాసపూజలకు భక్తులందరూ పాల్గొని భగవానుడి ఆశీస్సులు పొందాలని సందేశం ఇచ్చారు.
రెండురోజులుగా మందిరాలలో మంగళహారతులతో స్వామివార్ల దర్శనం, గీతా తులాభారం, ఉంజల సేవ అఖండ కీర్తనలు, నృత్యాలు, మహా శంఖాభిషేకం, మహాహారతి, ఉట్టి మహోత్సవం, మహా నివేదన చేయగా, వేలాదిగా వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు.

67
3624 views