logo

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రవి

దొడ్లేరు:

పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రవి, భారీ వర్షాలు మరియు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం ఆయన జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్‌తో కలిసి క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, వైద్య సిబ్బందికి అవసరమైన సూచనలు అందజేశారు. హసనాబాద్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని పరిశీలించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పారిశుధ్యం, దోమల నివారణ చర్యలు మరియు ఉచిత వైద్య శిబిరాలను ఆయన సమీక్షించారు. వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయించారు. గర్భిణీలు మరియు పిల్లలకు తక్షణ వైద్య సేవలు అందించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని సమీక్షించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్, మలేరియా సబ్ యూనిట్ అధికారి మొగల్ సుభాన్ బేగ్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ భూలక్ష్మి, ఆరోగ్య కార్యకర్తలు ప్రేమ రాజ్, ప్రహ్లాద్, అనుపమ, ఆశా కార్యకర్తలు త్రివేణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

8
1572 views