logo

వినియోగదారుల సేవలకు విశిష్ట ప్రతిభా పురస్కార అవార్డు

సత్యసాయి జిల్లా :

సత్య సాయి జిల్లా వ్యాప్తంగా వినియోగదారులకు సేవలందించినందుకు రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ విశిష్ట ప్రతిభా పురస్కార అవార్డును అందుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా చేతుల మీదుగా ఈ అవార్డు అందజేయబడింది.
సురేష్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో వినియోగదారుల సంఘాలు నిర్వీర్యమయ్యాయని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు, వినియోగదారుల వ్యవహారాల కమిషనర్ రాష్ట్రవ్యాప్తంగా సంఘాలను గుర్తించి ప్రతిభా పురస్కార అవార్డులు అందజేయాలని ప్రత్యేక జీవో జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డులు వినియోగదారుల సంఘాలు, వినియోగదారులు మరియు అధికారుల మధ్య సత్సంబంధాలను పెంపొందించడానికి దోహదపడతాయని, భవిష్యత్తులో సంఘాలు మరింత ఉత్సాహంగా సేవలు అందించేందుకు అవకాశం కల్పిస్తాయని ఆయన తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల సంఘాలను గుర్తించి అవార్డులు అందజేసినందుకు మంత్రి నాదెండ్ల మనోహర్, సివిల్ సప్లై కమిషనర్, జిల్లా కలెక్టర్లు, డిఎస్ఓలు మరియు తాసిల్దార్లకు సురేష్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

2
44 views