
వరద ప్రభావిత కాలనీలో పర్యటించిన మున్సిపల్ కమిషన్ తుంగపిండి రాయలింగు
16 -08-2005: పవర్ తెలుగు దినపత్రిక :వరద ప్రభావిత కాలనీలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాత్రి నుంచి కురుస్తున్న వర్ష.మందమర్రిలో పలు కాలనీలు మునిగిపోయాయి. ప్రధానంగా రెండో జూన్ భాగ్యనగర్ కాలనీ ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.ఈ విషయాన్ని కాలనీవాసులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాయిలింగు గారికి సమాచారం అందించగా వెంటనే స్పందించి హుటాహుటిన వరద ప్రభావిత కాలనీ *15 వ వార్డు భాగ్యనగర్ కాలనీ కి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు పైడిమల్ల నర్సింగ్ పాటు కాలనీ వాసులతో వర్షంలో వరద ప్రభవిత ఇండ్లను స్వయంగా పరిశీలించి . వరద నీరు ఇళ్లల్లోకి రావడానికి పలు కారణాలు తెలుసుకొని. కాలనీలో ఉన్న కాల్వలను వెడల్పు చేసి శుభ్రం చేయిస్తానని మరియు భాగ్యనగర్ కాలనీ కి వెళ్లే ప్రధాన రహదారి కల్వర్టు ఎత్తుపించి నిర్మాణం చేపడుతామని హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు పైడిమల్ల నర్సింగ్ గారు మాట్లాడుతూ వరద నీరు ఇళ్లలోకి రావడానికి ప్రధాన కారణం. సింగరేణి కాలనీలు అయినటువంటి ఒకటవ రెండవ జోన్ లో ప్రధాన కాలువలు లో మట్టి చెట్లు పేరుకుపోవడం సింగరేణి అధికారులు పట్టించుకోకపోవడం ప్రధాన కాలనీలకు వెళ్లే రహదారిలో పైపులతో చిన్న చిన్న కల్వర్టులు ఉండటం. వాటిని మరమ్మతులు చేయకపోవడం. ప్రధాన కల్వర్టులు ఎత్తు పెంచకపోవడం. భాగ్యనగర్ కాలనీ వెళ్లే ప్రధాన రహదారి వద్ద కల్వర్టు నిర్మించకపోవడం సింగరేణి అధికారులు పూర్తిగా విస్మరించడం అశ్రద్ధ నిర్లక్ష్యం ముఖ్య కారణం దీనిపై మున్సిపల్ కమిషనర్ గారికి వెంటనే ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం ద్వారా హుటాహుటిన కమిషనర్ గారు వచ్చి కాలనీలో పర్యటించి సమస్యను తెలుసుకోవడం వాటిని పరిష్కారం చేస్తా అని చెప్పడం అభినందనీయం ఇప్పటికైనా మందమర్రి సింగరేణి జిఎం గారు వెంటనే స్పందించి వరద సమస్యలు గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.మున్సిపల్ కమిషనర్ గారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీవాసులు ఉన్నారు.