
పుదుచ్చేరి ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ కాన్వొకేషన్ లో కొమ్మోజు రమేష్ కి “హానరరీ డాక్టరేట్ ఆఫ్ సోషియల్ సర్వీస్"
సమాజానికి చేసిన ఈ విశేష సేవలను గుర్తించి, 2025 ఆగస్టు 16 న పుదుచ్చేరి లోని షెన్భాగా హాల్ లో జరిగిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ కాన్వొకేషన్ లో విశ్వవిద్యాలయ ప్రతినిధులు రిజిస్టర్/ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ డాక్టర్ ఎ. గోపికన్నన్ దక్షిణ భారత UNIPC చీఫ్ డైరెక్టర్ డా.ఎ ప్రభు రాజేంద్రన్
చీఫ్ కౌన్సిల్ మెంబెర్ , గ్లోబల్ అక్సర్డిషన్ కౌన్సిల్, జర్మనీ డాక్టర్ జార్జ్ ఫ్రాయిండ్ పీటర్ చేతులమీదుగా కొమ్మోజు రమేష్ కి “హానరరీ డాక్టరేట్ ఆఫ్ సోషియల్ సర్వీస్" బహూకరించడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ "ఈ గౌరవం తన ఒక్కడిది మాత్రమే కాదు, ఆకర్ష్ కుటుంబం అంతటిది అదే విధంగా వాలంటీర్లుగా సహకరించిన ప్రతి ఒక్కరికి చెందుతుందని అన్నారు. ఇది మాకు మరింత బాధ్యతను, మరింత కృషి చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది" అని అన్నారు. అదేవిధంగా "జీవితంలో ఎదురైన వ్యక్తిగత వేదన, సమాజానికి వెలుగునిచ్చే మార్గం అవుతుంది"అనే ధ్యేయంతో 2010 డిసెంబర్ 31 న తన సోదరి నాగ పద్మావతి అనూహ్యంగా ఈ లోకం విడిచిపెట్టడం, తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అని అన్నారు,ఆ వేదనను తట్టుకుని, తన సోదరి జ్ఞాపకార్థం సమాజానికి ఏదో చేయాలనే సంకల్పంతో పుట్టినదే ఈ ఆకర్ష్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అన్నారు. 2012 ఆగస్టు 28న "ఆకర్ష్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ" అనే స్వచ్ఛంద సంస్థను అధికారికంగా రిజిస్టర్ చేసి, పది మందితో మొదలైన ఈ ప్రయాణం నేటికి కూడా వాలంటీర్ల మద్దతుతో ముందుకు సాగుతుందని తెలియజేశారు ఆకర్ష్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ పర్యావరణ పరిరక్షణ, పేద విద్యార్థుల విద్య, ఆరోగ్య సేవలు, మహిళా సాధికారిత, చట్ట అవగాహన, క్రీడల ప్రోత్సాహం, అనాధల సంరక్షణ వంటి మొదలు కార్యక్రమాలు నిర్వహించడంలో ఆకర్ష సంస్థ సఫలీకృతమైందని తెలియజేశారు. అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు కూడా ప్రతి విద్యార్థిని తన పుట్టినరోజుకి తన కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులకు సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని విద్యార్థులను మరియు విద్యార్థులు తల్లిదండ్రులను అవగాహన పెంచడం ద్వారా అత్యధిక మొక్కలు నాటడం జరిగిందని అన్నారు, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, హుదూద్ తుఫాన్ బాధితులకు సహాయం, గ్రామీణ ప్రాంతాల్లో చట్ట అవగాహన సదస్సులు, యువతలో నైతిక విలువల పెంపు, పర్యావరణ హితం, నీటి సంరక్షణ, ఎయిడ్స్ అవగాహన, క్రీడాకారుల ప్రోత్సాహం వంటి అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు అదేవిధంగా ఆకర్ష్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ తన స్థాపన నుండి నేటి వరకు "సేవే మాకు శ్వాస, సమాజమే మా బలం" అనే నినాదంతో ముందుకు సాగుతూ, కొత్త తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని గ్రామీణ ప్రాంతాలకు చేరుకుని, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, యువత అభివృద్ధి రంగాల్లో విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టాలని రమేష్ సంకల్పించారు. అదేవిధంగా 2021-22 లో అఖిల భారత అవార్డు - యువాచార్య అవార్డు, 2022-23 లో అఖిల భారత అవార్డు - కల్పాచార్య అవార్డు, 2024 లో వాసవీ స్వయం సేవా ట్రస్ట్ వారి అద్వర్యంలో అనంత సేవా స్మృతి పురస్కారం, 2024 లో SKVB సహకార సంఘం వారి అద్వర్యంలో ఉత్తమ సామాజిక సేవా పురస్కారం , 2025 లో ఆర్టిఐ మరియు సోషల్ యాక్టివిస్ట్ విభాగంలో మాజీ రాష్ట్రపతి బ్రహ్మశ్రీ “జ్ఞాని జైల్ సింగ్ జాతీయ అవార్డు” పొందినట్లు తెలియజేశారు.