logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రియ మిత్రుని పవిత్ర ఆత్మకు సద్ గతులు కలగాలి అనే సత్ సంకల్పంతో వెలుగురి శరత్ బాబు యొక్క ఆర్దిక సహాయం తో అన్నప్రసాద విత

ప్రియ మిత్రుని పవిత్ర ఆత్మకు సద్ గతులు కలగాలి అనే సత్ సంకల్పంతో వెలుగురి శరత్ బాబు యొక్క ఆర్దిక సహాయం తో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో493 వ రోజు భోజన ప్యాకెట్ల పంపిణీ చేస్తున్న టీం ను మరియు ఆర్యవైశ్య సేవా సమితి అధ్యక్షులు వెలుగురి శరత్ బాబు ను హృదయ పూర్వక ముగా అభినందిస్తున్నాము..... ఆత్మకూరి వెంకట హరేరామ చెంచయ్య.... సత్తెనపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం, అధ్యక్షులు.....ఈ రోజు అనగా ది 11.03.23,తేదీ,శనివారం ఉదయం11 గంటలకు సత్తెనపల్లి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో, తాడువాయి రాములు భవన్ వద్ద ఇటీవల అకాల మరణము చెందిన ఆర్యవైశ్య యువ సంఘం మాజీ అధ్యక్షులు మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక చింతనాపరులు కీర్తిశేషులు అన్నం వెంకట రామారావు గారి పవిత్ర ఆత్మకు సద్ గతులు కలగాలి అనే ఉద్దేశ్యంతో ఆర్యవైశ్య సేవా సమితి అధ్యక్షులు వెలుగురి శరత్ బాబు గారి యొక్క ఆర్దిక సహాయంతో 40 మంది నిరుపేదలకు, వృద్ధులు మరియు యాచకులకు భోజన ప్యాకెట్లను శరత్ బాబు గారి చేతులమీదుగా పంపిణీ చేశారు. ఇలా ప్రియ మిత్రుని ఆత్మకు సద్ గతులు కలగాలని భోజన ప్యాకెట్లను పంపిణీ చేసిన శరత్ బాబు ను పలువురు అభినందించారు. ఈనాటి కార్యక్రమంలో సేవా సమితి కోశాధికారి మద్ది వెంకటేశ్వర్లు, పెద్దలు చెఫూరి నాగేశ్వరరావు మరియు గుంటూరు సుబ్బారావు లు మరియు బీజేపీ సీనియర్ నాయకులు చందోలు వెంకట మల్లికార్జునరావు,షేక్ బుడే లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు దివ్వెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనాటి సేవా కార్యక్రమానికి సహాయ,సహకారాన్ని అందించిన వెలుగురి శరత్ బాబు కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

115
13852 views

Comment