logo

రక్షకుడు........

*వరద ముంపు రక్షకుడు మారంరెడ్డి*

*ప్రతి ఏటా తుఫానుల సమయంలో అలుపెరగని శ్రమ*

*20 గ్రామాలకు ప్రాణ, ఆస్తి నష్ట నివారనకు కృషి*

*వరద నీరు తగ్గే వరకు స్వర్ణముఖి కరకట్ట వద్ద కాపలా*

*తుఫాన్ సమయంలో సేవలు సాఫల్యం*

*మౌలిక వసతుల పునరుద్ధరణలో భేష్*

*ప్రభుత్వ పరిహార సాయం అందించడంలో ప్రథమ స్థానం*

*20 గ్రామాల ప్రజల హృదయాలను గెలుచుకున్న మనసున్న నేత మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి*

*వాకాడు స్వర్ణసాగరం* :


*ఫ్యాషన్ కోసం రాజకీయాలను చేసే వాళ్లను చూసాం.. పేరు డబ్బు హోదా కోసం రాజకీయాలను ఎంచుకునే వారిననీ చూశాం.. కానీ తమను నమ్ముకున్న గ్రామ ప్రజలకు నిష్పక్షపాక్షికంగా సేవ చేయడానికి రాజకీయాన్ని వేదికగా ఎంచుకున్న నేతను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆయన నిజాయితీకి ఓ నిలువుటద్దం.. మానవత్వానికి మనిషి రూపం.. పంచాయతీ ప్రజలకు నిలువెత్తు నమ్మకం.. అంతటి సుగుణాలను అలవరచుకున్న అరుదైన నాయకుడు .. ప్రతి ఏటా తుఫానుల సమయంలో అలుపెరగని కృషితో 20 గ్రామాల ప్రజల హృదయాలను గెలుచుకున్న ప్రజా సేవకుడు .. మన గంగనపాలెం గ్రామానికి చెందిన మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గూడూరు నియోజకవర్గ ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. పదేళ్లుగా కుటుంబాన్ని స్వలాభాన్ని పక్కనపెట్టి ప్రజా సేవకై పాటుపడుతున్న సంఘ సేవకుడిగా.. ఆయన చేసిన ఎన్నో సేవా..ధానాలను ప్రజలందరూ గుర్తురిగినవారే.ప్రజలకు సాయం అందించే సంఘ సేవకుడిగా మొదలైన ఆయన ప్రస్థానం రాజకీయాల వైపు మల్లి కీలక బాధ్యతలను చేపట్టినప్పటికీ ఆయనలోని సేవాగుణం ముందు ఖద్దరు రాజకీయం కకావికలమైపోయింది. పదవి ఎంత పెద్దదైనా ప్రజాసేవే ధ్యేయంగా నేటికీ పయనం అవుతోంది. ప్రజలకు నిత్యం అవసరమయ్యే మౌలిక వసతులను ఏర్పాటు చేయడంలో ఖద్దరు తొడిగి కూలీల కోసం ఎదురు చూడక విద్యుత్ పునరుద్ధరించే ఎలక్ట్రిషన్ గా, తాగు నీటిని అందించే ప్లంబర్ గా, వరద నీటిని ఆపేందుకు ఇసుక మూటల మోసే కూలీగా..నిత్యం ప్రజా సేవకు అంకితమై అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు.*

*ప్రతి ఏటా తుఫానుల సమయంలో అలుపెరగని శ్రమ*

2015 లో వచ్చిన తుఫాన్ లను అంచనా వేయడంలో విఫలమవడంతో తమ ప్రాంత ప్రజలకు జరిగిన నష్టాన్ని, పేద ప్రజలు పడ్డ కష్టాన్ని అనుభవ గుణపాఠంగా స్వీకరించి, అనంతరం ప్రతి ఏటా వస్తున్న తుఫాన్లకు తగిన ఏర్పాట్లను సిద్ధం చేసుకుని బాలిరెడ్డిపాలెం వంతెన వద్ద వచ్చే వరద ముంపులో విజేయుడుగా నిలుస్తూ, తద్వారా ముంపుకు గురయ్యే 20 గ్రామాల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే రక్షకుడిగా మారం రెడ్డి కిరణ్ రెడ్డి కీర్తి గడించాడు.

*మిచౌంగ్ తుఫాన్ ముంపు నివారించడంలో కృషి*

ప్రతి ఏటా వచ్చే తుఫానులకు బాలిరెడ్డిపాలెం వంతెన వద్ద ఏర్పడే ప్రమాద ఘటికలను మనం ప్రతి ఏటా చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈనెల అనగా డిసెంబర్ 3, 4వ తేదీలలో వచ్చిన మీచౌంగ్ తుఫాన్ బాలిరెడ్డి పాలెం వద్ద సృష్టించిన బీభత్సవాన్ని కూడా మనమందరం చూసాం. అయితే ఈ విపత్తుల ముందుగానే అంచనా వేసిన మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మూడు రోజులుగా స్వర్ణముఖి వంతెన వద్ద రేయింబవళ్లు కాపలాదారుడుగా వ్యవహరించి, అర్ధరాత్రి లో వచ్చిన వరద ఉధృతిని గ్రామస్తుల సహకారంతో అడ్డుకోవడంలో నిరంతరం శ్రమించి సఫలీకృతమయ్యారు. దీంతో ఆ వరద ఉధృతికి గురయ్యే 20 గ్రామాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రజలు, రైతులు కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కఠోర శ్రమకు కృతజ్ఞతలు తెలిపారు.

*మౌలిక వసతుల ఏర్పాటులో ముందు*

తుఫాన్ ప్రభావంతో వచ్చే వరదను అయితే ఆపారు కానీ, గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులతో విద్యుత్ తీగలు, స్తంభాలు చల్లా చదురుగా పడిపోయాయి. నాలుగు రోజులపాటు విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. తాగునీటికి ప్రజలు కటకటలాడిపోయారు. అయితే తుఫాన్ నిలిచిన అనంతరం మౌలిక వసతుల ఏర్పాటుకు సిద్ధమైన మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రాత్రింబవళ్లు శ్రమించి అన్ని శాఖల అధికారులతో తను కూడా మమేకమై వారితో కలిసి పని చేసి , విద్యుత్ పునరుద్ధరించడం, ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, పాడైపోయిన విద్యుత్ మోటార్లను తానే స్వయంగా బిగించడం, వంటి సేవలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రెండు రోజుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను రూపుమాపిన విధానాన్ని చూసి ప్రజలు హర్షిస్తున్నారు.

*ప్రభుత్వ పరిహారంలో ప్రథమ స్థానం*

తుఫాను ప్రభావంతో వరద నీరు చేరకపోయినప్పటికీ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు సముద్ర తీరానికి వెంబడి ప్రాంతం కావడంతో లోతట్టు ప్రాంతాలలోని నివాస గృహాలు మొత్తం నీటిలో మునిగిపోయాయి. తాను చేస్తున్న మౌలిక వసతుల ఏర్పాటుతోనే మౌనవహించక ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయం కూడా బాధిత ప్రజలకు అందించడంలో ప్రథమ స్థానంలో నిలిచారు.ఇలా 2015 అనంతరం ఏడేళ్ల కాలంలో వచ్చిన నాలుగు తుఫాన్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజలను తుఫాన్ ముంపు నుంచి కాపాడే వరద రక్షకుడిగా మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న ప్రజా సేవను ఎవరైనా కీర్తించాల్సిందే మరి.

0
0 views