సందట్లో సడేమియా.. లక్షల*సందట్లో సడేమియా.. లక్షల విలువ చేసే చెట్లు అక్రమ తరలింపు*
*సందట్లో సడేమియా.. లక్షల*సందట్లో సడేమియా.. లక్షల విలువ చేసే చెట్లు అక్రమ తరలింపు*
*♦️ అన్నీ తెలిసినా చూసి చూడనట్టు వదిలేస్తున్న అధికారులు*
----------------------------------------------
*Shaik Aseef @ 99Tv* ✍️
*(Kota-Vakadu-Chittamuru)*
--------------------------------------------★
*♦️ మీచౌంగ్ తుఫాను అందరికీ అపార నష్టం మిగిల్చితే.. పుష్పాలకు మాత్రం కాసుల పంట పండించింది.*
*♦️ తిరుపతి జిల్లా కోట వాకాడు చిట్టమూరు మండలాల్లో మీచౌంగ్ తుఫానుతో నేలకొరిగిన భారీ వృక్షాలు*
*♦️ టేకులాంటి విలువైన చెట్ల తరలింపులోనూ నిబంధనలు పాటించని వైనం*
*♦️ అనుమతి లేకుండా విచక్షణారహితంగా కొట్టి తరలిస్తున్న పుష్పాలు*
*♦️ కూలితో పోయేదానికి అక్రమార్కుల గొడ్డలి దాకా ఎందుకు..? అని మేధావులు సూటి ప్రశ్న.*
*♦️ లక్షల విలువైన చెట్ల దుంగలు పరులు, అక్రమార్కుల పాలు*
*♦️ సందట్లో సడేమియా రయ్ రయ్ మని అనుమతి లేకుండానే తరలింపు*
*♦️ చెట్లు నరికి ప్రజలకు మేలు చేస్తున్నట్టు పుష్పాల కలరింగ్.. కవరింగ్..*
*♦️ అధికారుల నిర్లక్ష్యాన్ని బాగా సొమ్ము చేసుకుంటున్న పుష్పాలు*
*♦️పుష్పాలతో అధికారులు కుమ్మక్కయ్యరా..? అంటూ ప్రజలు విమర్శలు*
----------------------------------------------
*మీచౌంగ్ తుఫాను అందరికీ విషాదం మిగిల్చింది. రైతులు, ప్రజలు నష్టపోయారు. తీర ప్రాంత మండలాల్లో అపార నష్టం వాటిల్లింది. ఐతే.. పుష్పలకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది.. తిరుపతి జిల్లా కోట వాకాడు చిట్టమూరు మండలాల్లోనే వందలాది చెట్లు నేలకొరిగాయి. భారీ వృక్షాలు వేళ్ళతో సహా పెకిలించబడి పడిపోయాయి.. గతమెన్నడూ లేని విధంగా వందల ఏళ్ళనాటి భారీ వృక్షాలు విరిగిపడ్డాయి.. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో పచ్చదనం కోసం పెంచిన చెట్లు ఒక్కసారిగా పడిపోయాయి. కొన్ని చోట్ల రవాణాకు ఆటంకం ఏర్పడింది..*
*రాకపోకల పునరుద్దరణ కోసం రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికివేసారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోయింది. విద్యుత్ సరఫరా సజావుగా జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి వరకూ చెట్ల నరికివేత బాగానే ఉంది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా అవసరం కూడా.. ఐతే మండల కేంద్రాలు, గ్రామాల్లో, మారుమూల పల్లెలు, కాలనీల్లో మాత్రం వందలాది చెట్లు విరిగిపడి అలాగే ఉండిపోయాయి. అధికారులు ప్రజాప్రతినిధులు తుఫాను నష్టపరిహారం అంచనా వివరాల సేకరణ, నగదు, నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమం, మరో ప్రక్క డిసెంబర్ 26 నుండి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్రా సన్నాహక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇది కొయ్యమిల్లుల యజమానులకు బాగా కలిసొచ్చింది.. చెట్లు కూలిన ప్రతి చోటా అన్ని రకాల పనిముట్లు, భారీ వాహనాలు వెంట తెచ్చుకుని వాలిపోతున్నారు.*
*వాల్టా చట్టమూ లేదు.. అడిగే అధికారీ లేడు.. రయ్ రయ్ మని పోయే లోడ్ పోతానే ఉంది. వచ్చే దుడ్డు వస్తానే ఉంది.. అన్నట్టు తయారయ్యింది పరిస్థితి.. వాస్తవానికి పంచాయతీలకు ఇది కూడా మేలైన ఆదాయం కల్పించే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.. దీంతో కొయ్యమిల్లుల యజమానులు, ప్రైవేట్ సైన్యం ఏ చెట్టును వదలడం లేదు. చెట్లను చుట్టు ముట్టి.. గొడ్డళ్ళు చేత పట్టి.. కొమ్మలు కొట్టి.. అధికారులకు మస్కా కొట్టి బాగానే ప్రకృతి సంపదను దోచుకుంటూ లక్షలు కొల్లగొడుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నాటి టేకు మొక్కలు ఇప్పుడు భారీ వృక్షాలుగా మారి మార్కెట్లో భారీ ధర పలుకుతున్ టేకు వృక్షాలు కనిపించే సరికి అక్రమార్కుల చేతులు ఆగడంలేదు. అనుమతులతో సంబంధం లేకుండా ఎడాపెడా నరికేస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులకు తెలిసినా చూసినా పట్టించుకోవడం లేదు. చోద్యం చూస్తున్నారు.*
*మండల, క్షేత్ర స్థాయిలో పెద్ద అధికార యంత్రాంగమే ఉన్నా ఏ అధికారి కానీ.. ఉద్యోగి కానీ పట్టించుకునే ఆలోచన చేయడం లేదు. దీంతో చెట్ల అక్రమ నరికివేత, తరలింపు దర్జాగా సాగుతోంది. కొంతమంది అధికారులు విధుల్లో బిజీగా ఉండడం, కొంతమంది అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం వీళ్లకు బాగా కలిసిరావడంతో సందట్లో సడేమియాలా పుష్పాలు చెలరేగిపోతున్నారు. పైగా చెట్లు నరికి ప్రజలకు మేలు చేస్తున్నట్టు పుష్పాల కలరింగ్.. కవరింగ్ ఇస్తున్నారు. అడ్డదిడ్డంగా చెట్లు నరకడం సరే... ప్రజలకు మేలు సరే.. ఆదాయం సంగతి మాటేంటి.! కూలీలతో నరికించి బాగా ఆదాయం గడించే అవకాశం ఉన్నా.. గాలికొదిలేసారు.. 'కూలితో పోయేదానికి అక్రమార్కుల గొడ్డలి దాకా ఎందుకు..?' అని మేధావులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.*
*ఇలా ఎవరి అనుమతి లేకుండా వందలాది చెట్లను విచక్షణారహితంగా కొట్టి తొలగిస్తున్నా తరలిస్తున్నా అటవీ, సంబందిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అందరూ చూస్తున్నా దర్జాగా చెట్లు నరికి తరలిస్తుండడంతో పుష్పాలు అధికారులు కుమ్మక్కయ్యరా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ కోట వాకాడు చిట్టమూరు మండలాల ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయా మండలాల పరిధిలోని కొయ్యమిల్లులపై తనీఖీలు నిర్వహిస్తే లక్షల విలువ చేసే వందల దుంగలు దొరకడం ఖాయమని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.* విలువ చేసే చెట్లు అక్రమ తరలింపు*
*♦️ అన్నీ తెలిసినా చూసి చూడనట్టు వదిలేస్తున్న అధికారులు*
----------------------------------------------
*(Kota-Vakadu-Chittamuru)*
--------------------------------------------★
*♦️ మీచౌంగ్ తుఫాను అందరికీ అపార నష్టం మిగిల్చితే.. పుష్పాలకు మాత్రం కాసుల పంట పండించింది.*
*♦️ తిరుపతి జిల్లా కోట వాకాడు చిట్టమూరు మండలాల్లో మీచౌంగ్ తుఫానుతో నేలకొరిగిన భారీ వృక్షాలు*
*♦️ టేకులాంటి విలువైన చెట్ల తరలింపులోనూ నిబంధనలు పాటించని వైనం*
*♦️ అనుమతి లేకుండా విచక్షణారహితంగా కొట్టి తరలిస్తున్న పుష్పాలు*
*♦️ కూలితో పోయేదానికి అక్రమార్కుల గొడ్డలి దాకా ఎందుకు..? అని మేధావులు సూటి ప్రశ్న.*
*♦️ లక్షల విలువైన చెట్ల దుంగలు పరులు, అక్రమార్కుల పాలు*
*♦️ సందట్లో సడేమియా రయ్ రయ్ మని అనుమతి లేకుండానే తరలింపు*
*♦️ చెట్లు నరికి ప్రజలకు మేలు చేస్తున్నట్టు పుష్పాల కలరింగ్.. కవరింగ్..*
*♦️ అధికారుల నిర్లక్ష్యాన్ని బాగా సొమ్ము చేసుకుంటున్న పుష్పాలు*
*♦️పుష్పాలతో అధికారులు కుమ్మక్కయ్యరా..? అంటూ ప్రజలు విమర్శలు*
----------------------------------------------
*మీచౌంగ్ తుఫాను అందరికీ విషాదం మిగిల్చింది. రైతులు, ప్రజలు నష్టపోయారు. తీర ప్రాంత మండలాల్లో అపార నష్టం వాటిల్లింది. ఐతే.. పుష్పలకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది.. తిరుపతి జిల్లా కోట వాకాడు చిట్టమూరు మండలాల్లోనే వందలాది చెట్లు నేలకొరిగాయి. భారీ వృక్షాలు వేళ్ళతో సహా పెకిలించబడి పడిపోయాయి.. గతమెన్నడూ లేని విధంగా వందల ఏళ్ళనాటి భారీ వృక్షాలు విరిగిపడ్డాయి.. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో పచ్చదనం కోసం పెంచిన చెట్లు ఒక్కసారిగా పడిపోయాయి. కొన్ని చోట్ల రవాణాకు ఆటంకం ఏర్పడింది..*
*రాకపోకల పునరుద్దరణ కోసం రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికివేసారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోయింది. విద్యుత్ సరఫరా సజావుగా జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి వరకూ చెట్ల నరికివేత బాగానే ఉంది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా అవసరం కూడా.. ఐతే మండల కేంద్రాలు, గ్రామాల్లో, మారుమూల పల్లెలు, కాలనీల్లో మాత్రం వందలాది చెట్లు విరిగిపడి అలాగే ఉండిపోయాయి. అధికారులు ప్రజాప్రతినిధులు తుఫాను నష్టపరిహారం అంచనా వివరాల సేకరణ, నగదు, నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమం, మరో ప్రక్క డిసెంబర్ 26 నుండి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్రా సన్నాహక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇది కొయ్యమిల్లుల యజమానులకు బాగా కలిసొచ్చింది.. చెట్లు కూలిన ప్రతి చోటా అన్ని రకాల పనిముట్లు, భారీ వాహనాలు వెంట తెచ్చుకుని వాలిపోతున్నారు.*
*వాల్టా చట్టమూ లేదు.. అడిగే అధికారీ లేడు.. రయ్ రయ్ మని పోయే లోడ్ పోతానే ఉంది. వచ్చే దుడ్డు వస్తానే ఉంది.. అన్నట్టు తయారయ్యింది పరిస్థితి.. వాస్తవానికి పంచాయతీలకు ఇది కూడా మేలైన ఆదాయం కల్పించే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.. దీంతో కొయ్యమిల్లుల యజమానులు, ప్రైవేట్ సైన్యం ఏ చెట్టును వదలడం లేదు. చెట్లను చుట్టు ముట్టి.. గొడ్డళ్ళు చేత పట్టి.. కొమ్మలు కొట్టి.. అధికారులకు మస్కా కొట్టి బాగానే ప్రకృతి సంపదను దోచుకుంటూ లక్షలు కొల్లగొడుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నాటి టేకు మొక్కలు ఇప్పుడు భారీ వృక్షాలుగా మారి మార్కెట్లో భారీ ధర పలుకుతున్ టేకు వృక్షాలు కనిపించే సరికి అక్రమార్కుల చేతులు ఆగడంలేదు. అనుమతులతో సంబంధం లేకుండా ఎడాపెడా నరికేస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులకు తెలిసినా చూసినా పట్టించుకోవడం లేదు. చోద్యం చూస్తున్నారు.*
*మండల, క్షేత్ర స్థాయిలో పెద్ద అధికార యంత్రాంగమే ఉన్నా ఏ అధికారి కానీ.. ఉద్యోగి కానీ పట్టించుకునే ఆలోచన చేయడం లేదు. దీంతో చెట్ల అక్రమ నరికివేత, తరలింపు దర్జాగా సాగుతోంది. కొంతమంది అధికారులు విధుల్లో బిజీగా ఉండడం, కొంతమంది అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం వీళ్లకు బాగా కలిసిరావడంతో సందట్లో సడేమియాలా పుష్పాలు చెలరేగిపోతున్నారు. పైగా చెట్లు నరికి ప్రజలకు మేలు చేస్తున్నట్టు పుష్పాల కలరింగ్.. కవరింగ్ ఇస్తున్నారు. అడ్డదిడ్డంగా చెట్లు నరకడం సరే... ప్రజలకు మేలు సరే.. ఆదాయం సంగతి మాటేంటి.! కూలీలతో నరికించి బాగా ఆదాయం గడించే అవకాశం ఉన్నా.. గాలికొదిలేసారు.. 'కూలితో పోయేదానికి అక్రమార్కుల గొడ్డలి దాకా ఎందుకు..?' అని మేధావులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.*
*ఇలా ఎవరి అనుమతి లేకుండా వందలాది చెట్లను విచక్షణారహితంగా కొట్టి తొలగిస్తున్నా తరలిస్తున్నా అటవీ, సంబందిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అందరూ చూస్తున్నా దర్జాగా చెట్లు నరికి తరలిస్తుండడంతో పుష్పాలు అధికారులు కుమ్మక్కయ్యరా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ కోట వాకాడు చిట్టమూరు మండలాల ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయా మండలాల పరిధిలోని కొయ్యమిల్లులపై తనీఖీలు నిర్వహిస్తే లక్షల విలువ చేసే వందల దుంగలు దొరకడం ఖాయమని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.*