
SC,ST, BC, మైనార్టీ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శావ నాగ జగన్ బాబురావు గారి ఆధ్వర్యంలో వారి సంఘం లో భారీ చేరికలు
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం రాష్ట్ర దళిత సంఘాల కార్యాలయంలో రాష్ట్ర మాల మహానాడు అండ్ అనుబంధ సంఘాల అధ్యక్షులు డాక్టర్ శావ నాగ జగన్ బాబురావు గారి సంఘంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ సంఘాలకు చెందినటువంటి గుడ్లవల్లేరు మండలం మాల మహానాడు ఉపాధ్యక్షుడిగా రేమల్లి. వరప్రసాద్ గారికి ,ఎన్టీఆర్ జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలిగా పిల్లి అనురాధకు నియామక పత్రాలు బాబురావు గారి చేతులమీదుగా ది 23వ తేదీన అందజేయడం జరిగింది. ఈ విషయమే బాబురావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో మహిళలకు కొన్ని హక్కులు కల్పించడం జరిగిందని ప్రతి మనిషి కులమత బేధం లేకుండా ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగిన నీతిగా నిజాయితీగా వాళ్ళకి అండగా ఉండాలని బాబురావు సూచించడం జరిగింది .రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కుల విజయకుమార్ మాట్లాడుతూ మా సంఘం రాష్ట్రవ్యాప్తంగా బాబురావు గారు కులమత బేధం లేకుండా చేస్తున్నటువంటి ఉద్యమాలను చూసి రేపు లేదు ఎల్లుండి కైకలూరు నియోజకవర్గం లో నలుగురు వ్యక్తులకు ఎల్లుండి పోస్టింగులు ఇస్తామని రాబోవు రాజకీయాలను దీటుగా ఎదుర్కోవడం కోసం అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని చేపడతామని విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర మాదిగ దండోరా ఉపాధ్యక్షులు ఏసు పోగు దానియేలు మాట్లాడుతూ మా కమిటీలో కులం లేదు మతం లేదు అన్ని వర్గాల వారిని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని మా ఉద్యమం కైకలూరు నియోజకవర్గం లో ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలని అణగద్రొకేవారికి త్వరలో గుణపాఠం చెప్పే కార్యక్రమం చేపడతామని దానియేలు అన్నారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జై మాలమహానాడు ముఖ్య అధ్యక్షులు గోగులమూడి రాము గారు మాట్లాడుతూ మా దళిత సంఘాలలో మాకు కులం లేదు మతం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలే అన్ని కులాల వారిని కలుపుకుని ఐక్యతతో మేము ముందుకు వెళ్తున్నామని రాము అన్నారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షురాలు చుక్కారాణి ,అందుగుల ప్రతాప్ కుమార్ గరికిముక్కుల రాజేష్, మహిత అందుగుల, తాడంకి వరదానం, కోటే సోమేశ్వరరావు, గూట్ల పౌలు ,అద్దంకి కృష్ణ ,దాసరి మణి, చీల్లి లావణ్య, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.