logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేత


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రగొండ మండలంలో ని ఎర్రబోడు గ్రామంలో 2001 కి పూర్వం నుండి ఎర్రబోడు గ్రామంలోనే ఉంటూ పోడుభూమి నీ సాగు చేసుకుంటున్నా గొత్తి కోయల గిరిజనుల పోడు భూమిని సాగు చేయొద్దంటూ ఫారెస్ట్ అధికారులు బెదిరింపులు కి పాల్పడుతున్నారని ఒత్తిళ్ళకి గురి చేస్తున్నారని, అవి కొత్త పోడు కాదు పాతవే సాగు చేసుకుంటున్నామని ఎంత చెప్పినా కూడా ఫారెస్ట్ అధికారులు వినట్లేదని రాతపూర్వకంగా చండ్రగొండ మండలంలోని తాసిల్దార్ , ఫారెస్ట్ రేంజర కు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ,సిపిఐ(ఎం) న్యూడెమోక్రసీ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి ఎస్కె ఉమర్ , చండ్రగొండ మండల కార్యదర్శి వరికూటి వెంకటరావు, రైతు కూలీ సంఘం మండల అధ్యక్షుడు తోడెం వెంకటేశ్వర్లు, ఆదివాసి గుత్తి కోయిల గిరిజనులు రవ్వ రమేష్, రవ్వ వెంకటేష్, మడివి బీమా, మడకం రాజేష్ ,మడకం సబ్ సింగ్, పోడియం లక్మ తదితరులు పాల్గొన్నారు

154
9189 views

Comment