కోవూరు అసెంబ్లీ ఎన్నికల పోటీలో దళిత మహిళ
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దళిత మహిళ పోలవరపు సునంద గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నేడు జరిగిన నామినేషన్ల పరిశీలనలో సునంద నామినేషన్ ఆమోదం పొందడంతో కోవూరు అసెంబ్లీ ఎన్నికల పోటీలో దళిత మహిళ నిలచినట్టయ్యింది. ఈ సందర్భంగా సునంద మీడియాతో మాట్లాడుతూ అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరి ఆధిపత్యం కోసం పోటీలు పడుతున్నాయి తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, జై మహాభారత్ పార్టీ అభ్యర్థినైన నాకు ఒక్క అవకాశం ఇస్తే, నిరంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ప్రజలతో మమేకమై వారి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. దళిత ఓటర్లు ఎక్కువగా వున్న కోవూరు నియోజకవర్గంలో దళితుల ఐక్యత చూపి, దళిత ఇంటి ఆడ బిడ్డనైన నన్ను ఆశీర్వదించి, అఖండ మెజారిటీతో గెలిపించాలని మీడియా ముఖంగా కోరారు.