
కోవూరు అసెంబ్లీ ఎన్నికల పోటీలో 13 మంది
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం శాసనసభ ఎన్నికల పోటీలో 13 మంది అభ్యర్థులు నిలిచారు. అభ్యర్థుల తుది జాబితాను కోవూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సేధు మాధవన్ సోమవారం మీడియాకి విడుదల చేశారు.
అభ్యర్థుల పేర్లు - ఎన్నికల గుర్తు
1. కడింపాటి అనీల్ - ఏనుగు (బహుజన సమాజ్ పార్టీ)
2. నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి - హస్తం (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్)
3. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి - సీలింగ్ ఫ్యాన్ (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ)
4. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి - సైకిల్ (తెలుగుదేశం పార్టీ)
5. ఆళ్ళ శివయ్య - కోటు (జైభీంరావు భారత్ పార్టీ)
6. పోలవరపు సునంద - వజ్రం (జై మహా భారత్ పార్టీ)
7. పంది రఘురాం - విజిల్ ( లోక్తాంత్రిక్ జనతా దళ్)
8. రామిశెట్టీ సాయి - ఉంగరం (రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా)
9. సోమా గోపాల్ - రైతు (భారత చైతన్య యువజన పార్టీ)
10. కందికట్టు ఉజ్వల కుమార్ - బ్యాట్ (ఇండిపెండెంట్)
11. చక్కిరాల అనితమ్మ - ఆపిల్ (ఇండిపెండెంట్)
12. మోడెమ్ శ్రీనివాసులు రెడ్డి - టై (ఇండిపెండెంట్)
13. షేక్ చోటే సాహెబ్ - గ్లాసు (ఇండిపెండెంట్)
జిల్లాలో అత్యధికంగా కోవూరు నియోజకవర్గం శాసనసభ ఎన్నికల పోటీకి 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు 36 మంది నామినేషన్లు దాఖలు చేస్తే, 29వ తేదీ నాటికి 13 మంది మాత్రమే ఎన్నికల బరిలో నిలబడ్డారు.