logo

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి వున్నాం: కార్తికేయ

జై మహాభారత్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యుడు పోలవరపు కార్తికేయ 2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురించి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ ఈసారి కోవూరు అసెంబ్లీ ఎన్నికల పోటీలో కోటీశ్వరులు వున్నారని, అతి సామాన్య కుటుంబం నుండి కోవూరు అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలుచున్న తమ పార్టీ అభ్యర్థి పోలవరపు సునంద ఎన్నికల ప్రచారం ఇతరుల కంటే ముందంజలో వున్నారని తెలిపారు. ఒక ప్రక్క అంతర్జాల టెక్నాలజీని ఉపయోగిస్తూ సోషల్ మీడియాలోనూ, మరో ప్రక్క మా అభిమాన బృందాలు ఓటర్లు వద్దకి నేరుగా వెళ్లి చేస్తున్న ఎన్నికల ప్రచారంలోనూ చాలా వేగంగా దూసుకుపోతున్నారని అన్నారు. ఇతర పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారని, మా పార్టీ ఎన్నికల ప్రచారం ఇతరుల కంటే భిన్నమైనదని, ఎన్నికల ప్రచారంలో ఎటువంటి ఆర్భాటాలు, హంగామాలు లేకుండా నేరుగా ఓటరుని కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికే తమ పార్టీ కట్టుబడి వున్నదని తెలుపుతూ, ఓటు వినియోగం గురించి చైతన్యం చేస్తున్నారన్నారు. ఎన్నికల తేదీ నాటికి ప్రజల్లో తమ పార్టీకి మరింత ఆదరణ పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ.వి.ఎం. మెషీన్ లో తమ పార్టీ అభ్యర్థి పోలవరపు సునంద పేరు 6వ నెంబరులో వున్నదని, ఎన్నికల గుర్తు డైమండ్ అని గుర్తు చేశారు. 13 వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్ లో కోవూరు నియోజకవర్గం ప్రజలు డైమండ్ గుర్తున్న బటన్ పై నొక్కి తమ పార్టీకి అత్యధిక మెజారిటీ అందించాలని మీడియా ముఖంగా కోరారు.

6
2961 views