logo

రైతుల వద్ద నుండి బ్యాంకులు పాత బాకీల కింద రైతు బంధు పైకాన్ని మినహాయించుకుంటే సహించేది లేదు - DCMS చైర్మన్ కొత్వాల

తెలంగాణ స్టేట్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:: పాల్వంచ మండలం:: మే 17


బ్యాంకు అధికారులు పాత బాకీల కింద రైతుబంధు పథకం ద్వారా మంజూరు అయిన పైకాన్ని రైతుల వద్ద నుండి వసూలు చేస్తే సహించేదిలేదని *DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు. పాల్వంచ మండల పరిధిలోని బిక్కు తండా, కమ్మరి గూడెం కి చెందిన రైతులు పాల్వంచ పట్టణం లోని యూనియన్ బ్యాంకు ద్వారా రుణాలు తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం రైతు బంధు పథకం కింద పైకాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. అట్టి పైకాన్ని బ్యాంకు అధికారులు అప్పు క్రింద మినహాయిస్తున్న విషయాన్ని రైతులు *కొత్వాల* దృష్టికి తేగా, వెంటనే స్పందించిన ఆయన నేరుగా బ్యాంకు కు వెళ్లి యూనియన్ *బ్యాంకు మేనేజర్ కె. నాగ శ్రీకాంత్,* సిబ్బందితో చర్చించారు. ఈ సందర్బంగా *కొత్వాల* మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రైతులకు అందిస్తున్నదనీ, అట్టి పైకాన్ని బ్యాంకు అధికారులు పాత అప్పు కింద జమ చేసుకుంటే ఊరుకోమన్నారు. త్వరలో ప్రకటించనున్న రైతు రుణమాఫీ పైకముతో వారి అప్పులు పూర్తిగా తీరిపోతుందన్నారు.

దీనికి స్పందించిన బ్యాంక్ మేనేజర్ రైతులకు మంజూరు అయిన పైకాన్ని వెంటనే అందజేశారు. ఈ సందర్బంగా రైతులు *కొత్వాల* ను అభినందించారు.

*ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, నాయకులు బాలినేని నాగేశ్వరరావు, ఎలికా సత్యనారాయణ, వజ్జల రాము, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.*

106
4036 views