సంగాం హత్యపై ఎంక్వయిరీని త్వరగా పూర్తిచేసి హంతకులను వెంటనే అరెస్టు చేయాలి :* రాజాం నియోజకవర్గ దళిత JAC సంఘాలు*:
*సంగాం హత్యపై ఎంక్వయిరీని త్వరగా పూర్తిచేసి హంతకులను వెంటనే అరెస్టు చేయాలి :* *రాజాం నియోజకవర్గ దళిత JAC సంఘాలు*: విజయనగరం జిల్లా రేగిడి మండలం, చిన్నశిర్లాం గ్రామంలో ఈ నెల 10వ తేదీ శనివారం అర్ధరాత్రి జరిగిన దళితవాడకు చెందిన 'ఉత్తరావల్లి సంఘాం' అనే విశ్రాంత ఉద్యోగిని హత్య చేసిన ఘటన తెలిసిందే! ఈ క్రమంలో ఈరోజు (18/5/23 శనివారం) మృతుని ఇంటి వద్దకు పలు దళిత సంఘాల నాయకులు చేరుకుని హత్యకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ హత్య చేసిన వ్యక్తులు ఎంతటి వారైనా పోలీసు వారు త్వరగా పట్టుకొని అరెస్టు చేసి, కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేబారికి రామప్పడు, బొత్స బుద్ధుడు, పేకేటి రామారావు, పాండ్రంకి శ్రీనివాసరావు, తేగల మోహనరావు, ఈసరి రాజు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.