ఈ పాపం.. ఎవరిది?
క్షణిక సుఖానికి లోబడి జరిగిన పాపమో.. నయవంచనకు గురైన అబల ప్రతిరూపమో కాని.. బాహ్య ప్రపంచాన్ని చూడాల్సిన పసికందు నెలలు నిండక ముందే చెత్త బుట్ట పాలైంది. ఈ హృదయ విచారకర ఘటన విజయనగరంలో చోటు చేసుకుంది. మెయిన్ రోడ్డులోని మనోహర్ షాప్ ఎదురుగా ఉన్న చెత్త కుండీలో శనివారం సాయంత్రం సుమారు 6:30 గంటలకు నెలలు నిండని పసికందు స్థానికులు కంటపడింది. పోలీసులకు సమాచారం అందడంతో టూ టౌన్ పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీటీవీ పుటేజలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.