Media valo bacho ko 100% raiti chaiye
*ప్రైవేట్ స్కూల్స్ లో జర్నలిస్టు పిల్లలకు 100% ఫీజు రాయితీ కల్పించండి** మంత్రి కొల్లు రవీంద్రని కోరిన మచిలీపట్నం మీడియా మిత్రులు* గత టీడీపీ హయాంలో 100% ఫీజు రాయితీ ఇచ్చారని గుర్తు చేసిన జర్నలిస్టులు* గత ప్రభుత్వంలో ఫీజు రాయితీ ఉత్తర్వులను నిలిపివేశారని వాపోయిన జర్నలిస్టులు* 100% ఫీజు రాయితీపై సానుకూలంగా స్పందించిన మంత్రి రవీంద్ర*మచిలీపట్నం, జూన్ 19 :*2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా ప్రైవేట్ స్కూల్స్ లో జర్నలిస్ట్ పిల్లలకు 100% ఫీజు రాయితీ కల్పించాలని మచిలీపట్నం మీడియా మిత్రులు ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు బుధవారం రాష్ట్ర గనులు మరియు భూగర్భవనరులు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు వినతిపత్రం అందజేశారు. స్థానిక R&B అతిథి గృహంలో మంత్రి రవీంద్రని మచిలీపట్నంలోని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు కలిశారు. 2014-19 సంవత్సర కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 100% ఫీజు రాయితీ కల్పిస్తూ ప్రతి సంవత్సరం సర్క్యులర్ విడుదల చేశారన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 100% ఫీజు రాయితీని పూర్తిగా నిలిపివేయడం వల్ల ఫీజులు చెల్లించే విషయంలో జర్నలిస్టులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో అమలు చేసిన 100% ఫీజు రాయితీ ఉత్తర్వులను తిరిగి పునరుద్దరించాలని జర్నలిస్టులు మంత్రి కొల్లు రవీంద్రని కోరారు. దీనిపై స్పందించిన రవీంద్ర జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానాను పిలిచి 100% ఫీజు రాయితీకి గల అవకాశాలను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కొల్లు రవీంద్రకు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.