logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఈ నెల 4వ తేదీ భారత్ బంద్ కి అన్ని విద్యార్థి సంఘం పక్షాలు కలిసి పిలుపునిచ్చాయి -షేక్ జానీ బాబాNSUI స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అధ్యక్షులు

•ఈ నెల 4వ తేదీ భారత్ బంద్ కి అన్ని విద్యార్థి సంఘం పక్షాలు కలిసి పిలుపునిచ్చాయి షేక్ జానీ బాబాNSUI స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అధ్యక్షులు

నీట్ విద్యార్థుల సమస్య పరిష్కారానికై జులై 4వ తారీకున విద్యార్థి సంఘాల ఐక్య కమిటి పిలుపులో భాగంగా (ఎన్.యస్.యు.ఐ., యస్.ఎఫ్.ఐ. ఎ.యస్.ఎఫ్, పి.డి.యస్.యు. వి.జె.యస్. ఎ.ఐ.పి.యస్.యు., పి.వై.సి., డి.వై.ఎఫ్.ఐ, ఎ.ఐ.వై.ఎఫ్., పి.వై.ఎల్. వై.జె.యస్.,) విద్యార్ధి సంఘాలు భారతదేశ వ్యాప్తంగా విద్యాసంఘాలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కావున మా ఉద్యమానికి మీ మద్దత్తు తెలుపుతూ విద్యాసంస్థలు అన్నీ ఎ.జి నుండి పి.జి వరకు బందకు సహకరించవలసిందిగా కోరుచున్నాము.

డిమాండ్లు:

1) ఈనెల 6వ తేదీన నీట్ కౌన్సిలింగ్ జరిపే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి.

2) 24 లక్షల నుంది విద్యార్థుల జీవితాలతో కేంద్రప్రభుత్వం ఆ అడుకుంటుంది.

3) ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి.

4) అలాగే కేంద్ర ప్రభుత్వం ఎన్.టి.ఎ. సంఘమును వెంటనే రద్దు చేయాలి.

5) 24 లక్షల మంది నీట్ పరీక్ష వ్రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలి.

6) తెలంగాణ కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిగార్లు దీనిపైన స్పందించాలి.

7) కేంద్ర విద్యాశాఖామంత్రి నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి.

8) నీట్ పరీక్ష నిర్వహించిన ఏజెన్సీ ఎన్.టి.ఎ.ను రద్దు చేయాలి. అలా చేసేంతవరకు అందరం కలిసి పోరాటం చేద్దాం..

9) ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద మహాదీక్ష చేస్తాము.

10) న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతూనే వుంటుంది.

దయచేసి కే.జి. నుండి పి.జి. వరకు అన్ని విద్యాసంస్థలు బంద్ పాల్గొనాలని, బాధిత విద్యార్థులకు అండగా ఉండాలని విద్యార్థి సంఘాల నాయకులమందరము కోరుచున్నాము.

ఈకార్యక్రమంలో నీల మహేష్,అఖిల్, రియాజ్, AISF యూనస్, SFI యాకన్న, పాల్గొన్నారు

230
25316 views

Comment