logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారి జయంతి సందర్భంగా

*తేదీ:08-07-2024సోమవారం*

*ఘనంగా వై.యస్.ఆర్ జయంతి*

*వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి*

*బొబ్బిలి నియోజకవర్గం ౼ బొబ్బిలి పురపాలక సంఘం*

_దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు స్వర్గీయ డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి ని పురస్కరించుకుని బొబ్బిలి పట్టణంలో గల అమ్మిగారి కోనేరు వద్ద ఉన్న వై.యస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి బొబ్బిలి మాజీ శాసన సభ్యులు శ్రీ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు గారు వైసీపీ నాయకులు,కార్యకర్తలుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం పేద మహిళలకు ఆయన చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా పట్టణంలో గల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చిత్రపటానికి ఘన నివాళులర్పించి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కటింగ్ చేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంబంగి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి సేవలు మరువలేనివి అన్నారు.అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రతీ పేదవాళ్ల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని ఆయన ఖ్యాతిని కొనియాడారు._

_ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు శంబంగి వేణుగోపాలనాయుడు,మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీ కృష్ణరావు,వైస్ చైర్మన్,చెలికాని మురళీకృష్ణ,గోళగాన రమాదేవి,వైసీపీ సీనియర్ నాయకులు తూముల భాస్కరరావు,ఇంటి గోపాలరావు,పట్టణ పార్టీ అధ్యక్షుడు చోడగంజి రమేష్ నాయుడు వివిధ గ్రామ స్థాయి నాయకులు,మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు,కో-ఆప్షన్ సభ్యులు,పట్టణంలో గల ముఖ్య నాయకులు పాల్గొన్నారు._

165
16626 views

Comment