logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బ్యాంబో క్లస్టర్ కు సహాయ సహకారాలు అందిస్తా

చంద్రుగొండ సెప్టెంబర్ 13: కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు బ్యాంబో క్లష్టర్ సభ్యులు, జిల్లా గ్రామీణాభివృద్ధి అదికారి విద్యా చందనను, భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి బ్యాంబో క్లష్టర్ కు సంబంధించిన పలు అంశాలపై లిఖిత పూర్వకంగా సమర్పించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించి చండ్రుగొండ బ్యాంబో క్లష్టర్ కు తప్పకుండా అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. త్వరలో బ్యాంబో క్లష్టర్ సందర్శిస్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో చండ్రుగొండ బ్యాంబో క్లష్టర్ చైర్మన్ వీసం నాగభూషణం, వైస్ చైర్మన్ మల్లం కృష్ణయ్య , సభ్యులు బొర్రా సురేష్, కారం అన్వేష్, వర్స శ్రీను పాల్గొన్నారు.

171
6789 views

Comment