
కొండలను మింగుతున్న అనకొండ
కొండలను మింగుతున్న అనకొండ
+ ఆధ్యాత్మిక ముసుగులో కొండలను మింగుతున్న అనకొండ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
+ గతంలో నూజివీడు మండలంలోని బోర్వంచ పరిధిలోని రేగుంట రోడ్డు సమీపంలో కొండను కొల్లగొట్టిన ఘనులే
+ ప్రస్తుతం నూజివీడు మండలం రావిచర్లలోని నల్లగట్టుని పై వరకు రోడ్డువేసి మరి కోళ్లగొడుతున్న వారు ఒక్కరే కావడం గమనార్హం.
+ రావిచర్లలోని నల్లగట్టు తూర్పు భాగంలో రెండెకరాల భూమిని కొని కొండమీదకి ఘాట్ రోడ్డుని వేసి మరి కొండను మింగుతున్నారు.
+ కొండపై నలబై ఎకరాల వరకు జేసిబిలతో చదును చేసి దర్జాగా కబ్జాచేసి మామిడి మొక్కలను నాటిస్తున్న వైనం
+ కొండ భూమిలో మామిడి మొక్కలను నాటించే క్రమంలో కబ్జా బయట పడకుండా తన విద్య సంస్థలో చదివే విద్యార్థులచేతనే మొక్కలను నాటించారు.
+ నల్లగట్టు ఆక్రమణలు గట్టుక్రిందే కాకుండా కొండమొత్తం పాకుకుంటు వెళ్లడంతో అప్రమత్తమైన రావిచర్ల గ్రామస్థులు ఆదివారం అడ్డుకున్నారు.
+ కొండ ఆక్రమణలను అడ్డుకొని గట్టుని తవ్వుతున్న పాక్లేయిన్ ని ఒక ట్రాక్టర్ ని నిలువరించి నూజివీడు తహసీల్దార్ కి సమాచారం అందించారు.
+ తహసీల్దార్ ఆర్ ఐ అశోక్, వీఆర్వో రాజ్ కుమార్ లు సంఘటనస్థలికి వెళ్లి పాక్లేయిన్, ట్రాక్టర్ ని సీజ్ చేసినట్లు ప్రకటించారు. అయితే సాయంత్రంకి సీన్ మారి పొయ్యింది.
+ సీజ్ చేశామని చెపుతున్న పాక్లేయిన్, ట్రాక్టర్ సైతం ఆదివారం రాత్రి ఏడు గంటల వరకు కూడా నూజివీడుకి తీసుకు రకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
+ కొంతమంది ఎలక్ట్రాన్ మీడియా వారు కబ్జాకి పాల్పడుతున్న వారికి కొండంత అండగా నిలబడి అక్రమణలను సక్రమం అనే విధంగా రేవున్యూ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు.
+ ఒత్తిడికి తలోగ్గిన రెవిన్యూ సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం వరకు ఆక్రమణ అని సాయంత్రం అయ్యే సరికి అదంతా సక్రమే అన్నట్లు స్వరం మార్చారు.
+ రెవిన్యూ అధికారుల వైఖరితో పాత రావిచర్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
+ సోమవారం జరిగే మీకోసంలో కొండ కబ్జా దారులపై, రెవిన్యూ సిబ్బంది వైఖరిపై కలెక్టర్, సబ్ కలెక్టర్ కి పిర్యాదు చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు.