logo

నూజివీడు మండలం ఎంపీడీవో కి గ్రామస్తులు కృతజ్ఞతలు ప్రతి ఇంటికి ఉపాధి హామీ కార్డు

*నూజివీడు మండలం ఎంపీడీవో కి గ్రామస్తులు కృతజ్ఞతలు*


*ప్రతి ఇంటికి ఉపాధి హామీ కార్డు*

*ప్రతి ఒక్క ఇంటికి ఉపాధి హామీ కార్డు పంపించవలసిందిగా అదేశాలు ఎంపిడిఓ నూజివీడు*

*మహిళా పోలీసులు మరియు వెల్ఫేర్ అసిస్టెంట్లకు మీర్జాపురం లో 50 మందికి డ్యూటీ కార్డుల పంపిణీ కార్యక్రమం*


ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం,పరిధిలోని నూజివీడు మండలం,మీర్జాపురం గ్రామంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు మీర్జాపురం గ్రామంలో చాలా అవకతవకలు జరిగాయి అని గుర్తించడం జరిగింది. దీని పైన ఇకపై ఎటువంటి అవకతవకలు జరగకుండా క్రమశిక్షణ చర్యలో భాగంగా ప్రతి ఇంటికి ఉపాధి హామీ కార్డు ఉంటే ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండదని నూజివీడు మండల ఎంపీడీవో మీర్జాపురం గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి ఉపాధి హామీ కార్డు పంపించవలసిందిగా ఆదేశిస్తూ నూజివీడు మండలంలోని మహిళా పోలీసులు మరియు వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఈరోజు మీర్జాపురం లో 50 మందికి డ్యూటీ వేశారు. ఈ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మీర్జాపురం గ్రామ సర్పంచ్ శ్రీమతి గోళ్ళ పద్మ మరియు గ్రామ పెద్దల సమక్షంలో ప్రారంభించడం జరిగింది. దీనివల్ల భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఎవరి పనికి తగ్గ వేతనం వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ గా పడటం కోసం మరియు ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా జరుగుతుంది ఇటువంటి మంచి విషయాన్ని చేసినా నూజివీడు ఎంపీడీవో కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

4
5018 views