logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Srihari: వాడు నా అయ్య..! శ్రీహరి నాన్న అని పిలిచే ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా.?

లక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీహరి. విలన్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి ఆతర్వాత హీరోగా సినిమాలు చేశారు. ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాడు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి.
తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు దివంగత నటుడు శ్రీ హరి. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు శ్రీహరి. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సహాయక పాత్రలు చేస్తూ ఆ తర్వాత హీరోగా మారారు శ్రీహరి. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి ఇది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట. 1986లో సినిమాలోకి స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి…అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు.
సినిమా అట్టర్ ప్లాప్.. స్టార్ హీరోయిన్‌ను బండబూతులు తిడుతున్న ఫ్యాన్స్
జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి చాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా….సినిమాలపై మక్కువతో ఈ రంగంవైపు అడుగులు వేసారు. 2000వ సంవత్సరంలో వచ్చిన ‘పోలీస్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. గణపతి, ఆయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, ఢీ, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు శ్రీహరి. 2013 న కాలేయ సంబంధ వ్యాధి కారణంగా ముంబై లో కన్నుమూసారు శ్రీహరి.

107
13795 views

Comment