logo

Central Education Ministry : స్కూల్‌ ఇన్నోవేషన్‌ మారథాన్‌కు 76 ప్రాజెక్టులు ఎంపిక

నిర్వహించే ‘స్కూల్‌ ఇన్నోవేషన్‌ మారథాన్‌’కు రాష్ట్రం నుంచి 76 ప్రాజెక్టులు ఎంపికయ్యాయని సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 5,443 పాఠశాలలకు చెందిన 61,207 మంది విద్యార్థులు దీనిలో పాల్గొన్నట్టు పేర్కొన్నారు. 8,748 వినూత్న ఆలోచనల ప్రాజెక్టులను రూపొందించారన్నారు. వాటిలో 76 ప్రాజెక్టులను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఏఐసీటీఈ, యూనిసెఫ్‌, ఏఐఎం ఎంపిక చేశాయని తెలిపారు. ఎంపిక ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్థులను ఎస్పీడీ అభినందించారు.

5
5600 views