logo

విధుల బహిష్కరణ కార్యక్రమం తాత్కాలిక వాయిదా



ఈనెల 10,17,24వ తేదీల్లో వైద్యసేవ సిబ్బంది విధుల బహిష్కరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జిల్లా ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్‌ జెర్రిపోతుల ప్రదీప్‌ తెలిపారు. విజయనగరంలో మాట్లాడుతూ...
వైద్యసేవ ట్రస్ట్‌ అధికారులు ఈనెల 12వ తేదీన చర్చల పిలుపు మేరకు విధుల బహిష్కరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో వైద్యసేవ సిబ్బంది రేపు యథావిధిగా విధుల్లో పాల్గొంటారని తెలిపారు.

9
3539 views