ప్రపంచ కవిత దినోత్సవం
ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ప్రముఖ కవి అయినటువంటి వి ఎస్ శ్రీనివాస్ ఐతియారం ఐత్యారం ముచ్చట్లు లో భాగంగా తన కవితను వినిపించారు.యుగం ఒక క్షణముగానిలిచిన క్షణమున..... నీ పలుకులు వినపడని క్షణమున.... క్షణం ఒక యుగమై...... మదిలో రేగిన అలజడి మెదడుని తొలిచిన వేళ..... యదలో పొంగిన ప్రేమను నీతో తెలిపిన క్షణమున..... మదిలో సప్తస్వరాలు పాడినవి.... అది చూసిన సూర్యుడు తాండవం చేయగా..... హరివిల్లును హంసలు మోసుకువచ్చి సప్తవర్ణాలు ఆకాశంలో నింపగా....... అది చూసిన కనులకు నీ రూపమే గుర్తుకు వచ్చెనే...... అది విని చిటపట చినుకులు రాలితే. ఎప్పుడు నీ దర్శనం దేవీ అంటూ గుండె తలుపులలో నీ తలపులే.... వేచిన నా నా రాక్షసి..... హృదయంలో నాకే తెలియని ఈ మార్పు ఏంటి..... కవిత రచన : విఎస్.శ్రీనివాస్