ఏఎంసీ పదవులపై తెలుగు తమ్ముళ్లు ఆవేద
విజయనగరం జిల్లా:- రాజాం శుక్రవారం ప్రకటించిన కూటమి ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని జనసేనకి కేటాయించడంపై రాజాం స్థానిక టిడిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు టిడిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని రాజాంలో జనసేనకి క్యాడర్ అనేది లేదు అని అదేవిధంగా దశాబ్దాలుగా టిడిపి జెండా మోస్తూ ఎన్నో ఆటుపోట్లకు నిలిచి పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు ఎంతోమంది ఉండగా ఈ నామినేటెడ్ పదవిని జనసేనకి కేటాయించడం ఎంతో బాధగా ఉందని పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని పునరాలోచించాలని ఆవేదన వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ఓమ్మి సర్పంచ్ వంగా వెంకట్రావు రాజం టౌన్ ప్రెసిడెంట్ నంది సూర్య ప్రకాష్ రాజాం తూర్పు కాపు సంఘ అధ్యక్షులు శాసపు రమేష్ దూబధర్మ కన్నమనాయుడు తదితరులు పాల్గొన్నారు