
బుగ్గారంలో సన్న బియ్యం పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
బుగ్గారంలో సన్న బియ్యం పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని బుధవారం బుగ్గారం మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రారంభించారు.
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాలతో, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ సూచనతో బుగ్గారం స్థానిక నాయకులు కలిసి చౌక ధరల దుకాణాలలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినట్లు స్థానిక నాయకులు ప్రకటన జారీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి సన్నబియ్యాన్ని పోటా - పోటీగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నగునూరి నర్సగౌడ్, జిల్లా కార్యదర్శి పెద్దనవేణి శంకర్, గ్రామశాఖ అధ్యక్షులు కొడిమ్యాల రాజన్న, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు జంగ శ్రీనివాస్, తాడేపు లింగన్న, మాజీ ఎంపీటీసీ నగునూరి రామగౌడ్, పొనకంటి కైలాసం, నగునూరి పెద్ద రామగౌడ్, దశర్తి పోసన్న, అహ్మద్ షరీఫ్, నక్క శంకర్, ఇల్లంధుల స్వామి, నగునూరి శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.