logo

మహాత్మ జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ... మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే పిలుపు...



ప్రముఖ సంఘసంస్కర్త, సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిబాపూలే 199 వ అధికారిక జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఫూలే గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మాలి కులస్తులంతా శుక్రవారం ఉదయం 9 గంటల లోపు మీ మీ గ్రామాల్లో జయంతి కార్యక్రమాలు జరుపుకొని 10 గంటలకు బుక్తాపూర్ లోని ఫూలే చౌక్ చేరుకోవాలని, ఆ తర్వాత పదిన్నరకి జిల్లా పరిషత్ సమావేశ మందిరం ఆదిలాబాద్ లో జరిగే అధికారిక జయంతి వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు జిల్లా అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథుల, ప్రముఖ వక్తుల బీ.సీ సంఘ నాయకుల ఉపన్యాసాలతో పాటు "జ్యోతిబాపూలే మరియు సావిత్రిబాయి పూలేల జీవిత చరిత్రపై సుకుమార్ పేటకులే " ద్వారా ఏకపాత్రబినయం" ఉంటుందని అలాగే భరంపూర్ కి చెందిన కొరియోగ్రాఫర్ బెల్లపు రమేష్ బృందం మరియు విద్యార్థిని, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కావున బహుజన వాదులు ఎస్సీ, ఎస్టీ, బీ.సీ, మైనార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి పులే దంపతుల ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాలీ మహా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న షేన్డే, జిల్లా అధ్యక్షులు దారట్ల విజయ్, మాలి ఉద్యోగ సంఘ బాధ్యులు భాస్కర్ ప్రధాన్, కోట్రంగే అనిల్ తదితరులు పాల్గొన్నారు.

13
2518 views