logo

ప్రకటన ----------- కార్పొరేట్లకు లాభాలు -పేదాలపై భారాలు పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించు కోవాలి భగత్ సింగ్ నగర్ లో సిపిఎం నిరసన . సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్


-----------------------
కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ ,పెంచిన ధరను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ లో గ్యాసు బండ,కట్టెల పోయితో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ..... , కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతూ పెదాల,మధ్యతరగతి ప్రజల నడ్డివిరుస్తున్నాదని మండి పడ్డారు. కార్పొరేట్ బడావ్యాపారుల కోసం తాపత్రయ పడే బీజేపీ ప్రభుత్వానికి పేదల గురించి పట్టడం లేదని అన్నారు . గ్యాస్ సబ్సిడీ సైతం తొలగించి వేసింది అని ఎద్దేవా చేశారు . కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్.మంజుల ,బొజ్జ ఆశన్న భగత్ సింగ్ నగర్ శాఖ కార్యదర్శి.ఆర్.ప్రభు నాయకులు కే .ఆశన్న,అరఫా బేగం,పూసం సయ,రేణుక,మయూరి,ఖాన్, ఉస్మాన్ భగత్ సింగ్ నగర్ కాలనీవాసులు,నాగేష్,సునీత, మంగళ,అనసూయ తదితరులు పాల్గొన్నారు.

0
222 views