డిఏపి వద్దు ఘన జీవామృతం ముద్దు
సంతకవిటి/రాజాం.
సంతకవిటి మండలం మామిడిపల్లి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది యూనిట్ ఇంచార్జ్ పాత్రుని వెంకటరమణ మోడల్ మేకర్ పొగిరి అన్నమనాయుడు ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు ఉండే రైతులకు డిఏపి యూరియాకు బదులు ఘనజీవమృతం తయారీని ప్రయోగాత్మకంగా చేసి వివరించడం జరిగింది రైతులు మార్కెట్లో దొరికే డి ఏ పి 1500 రూపాయలు వెచ్చించి ఎరువులు కొంటున్నారు దానికి బదులు సేంద్రియ పద్ధతుల ద్వారా ధన జీవ అమృతం 100 కేజీల పేడ రెండు కేజీల బెల్లము రెండు కేజీల శెనపిండి 10 లీటర్ల ఆవు మూత్రము గుప్పెడు పుట్టమొన్ను సహాయంతో బాగా కలుపుకొని ఉండలుగా తయారుచేసి నీడలో ఆరబెట్టి పది రోజుల తర్వాత వాటిని చెంచులో ఎత్తి పొలాల్లో వేసుకోవడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి వానపాములు ఎర్రలు సూక్ష్మజీవులు నిద్రావస్థలో ఉండే పంటకు కావలసిన మిత్ర జీవులు కూడా నెలలో వృద్ధి చెందుతాయని రైతులు ఈ విధంగా చేసుకుంటే పెట్టుబడులు తగ్గి ఆదాయాలు పెంచవచ్చునని మంచి ఆహారం మంచి నేల మంచి వ్యవసాయ ఉత్పత్తులు పొందవచ్చునని రైతులకు వివరించి ప్రయోగాత్మకంగా తయారు చేసి చూపించడం జరిగింది.