దేశాయిపేటలో కుస్తీ పోటీలు
బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో ఆదివారం గ్రామ కమిటి ద్వారా ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలలో శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుస్తీ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.