Nandyal;అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించిన చాపిరేవుల గ్రామ టిడిపి జనసేన కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు
చాపిరేవుల; రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చాపిరేవుల ఎస్సీ కాలనీ గ్రామ పురవీదులలో మరియు ఊరి బయటికి ఊరేగింపుగా తీసుకొని మారెమ్మ గుడి దగ్గర వేడుకలు జరపడ మైనది. మరియు గ్రామసభ మీటింగ్ నందు గ్రామ సర్పంచ్ టిడిపి జనసేన కార్యకర్తలు మరియు పంచాయతీ సెక్రెటరీ అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ పేద ,బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కరనీ కొనియాడారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారన్నారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ కృషి అమోఘమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డిఎన్ రాజు మరియు భూపాల్ రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి ,జిల్లెల్ల మధు, బిజ్జల శేఖర్ రెడ్డి, జీవరత్నం, మంటి రాజశేఖర్, జ్ఞాన ప్రకాశం పులిమద్ది సుబ్బరాయుడుకార్యకర్తలు పాల్గొన్నారు