logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భారత మాజీ ప్రధాని స్వర్గీయ డాక్టర్.బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో కొత్తపల్లి నారాయణరాజు

*భారత మాజీ ప్రధాని స్వర్గీయ డాక్టర్.బాబు జగ్జీవన్ రాం 118.వా జయంతోత్సవాల ముఖ్య అతిథి కొత్తపల్లి నారాయణరాజు* నీలగిరి వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో కొత్తగూడెం మండలం జరిగిన బి.సి. సంఘం నాయకులు బాబుజగజీవన్ రామ్118.వ. జయంతోత్సవలా కు వోచిన సందర్భం గా కొత్తపల్లి నారాయణ రాజు సభ నుద్దేశించివేవరించారు బాబుజగ్జీవన్ రాం (ఏప్రిల్ 5, 1908 - జులై 6 1986) పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు మరియు సంఘ సంస్కర్త. బీహార్ లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా కూడా వ్యవహరించారు.
పట్టుదల నిండిన ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ తన రాజకీయ జీవితాన్ని ఆదర్శప్రాయంగా కొన సాగించా ర నీ విద్యావేత్తగా, మచ్చలేని నిస్వార్ధ నాయకునిగా, కరవు కోరల్లో చిక్కిన భారతావనిని వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని సాకారం చేసి భారత ఆహార గిడ్డంగుల నేర్పరిచిన భారత దార్శనీకునిగా, అభివర్ణించాడు బ్రిటిష్‌ కాలం నాటి రైల్వే వ్యవస్థను ఆధునికీకరించే దిశగా అడుగులు వేసిన రైల్వేమంత్రిగా, కయ్యానికి కాలుదువ్విన శత్రువును మట్టికరిపించి భారతదేశానికి విజయాన్ని అందించిన భారత సేనకు మంత్రిగా ధీరోదాత్తతను ప్రదర్శించి యావత్‌ భారత్‌ ప్రజానీకం గుండెల్లో నేటికీ సజీవంగా ఉన్నారు. దూరదృష్టితో దీర్ఘకాలిక ప్రణాళికారచనలో ఆయనకు సాటిరారన్న రు నాటి నాయకుల మాటలు అక్షర సత్యాలు. చివరికంటూ ఉప్పొంగే ఉత్సాహంతో పనిచేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ బీహార్‌ రాష్ట్రంలో షాబాద్‌ జిల్లాలోని చాందా గ్రామంలో శిబిరాం, బసంతీదేవి పుణ్యదంపతులకు 1908 ఏప్రిల్‌ 05న జన్మించారు. వీరిది దళిత కుటుంబం కావడంతో నాటి కుల సమాజపు అవమానాల్ని చవిచూశారు. నాటి అంటరాని తనమే జగ్జీవన్‌ రామ్‌ను సమతావాదిగా మార్చింది. నిరంతరం చైతన్యపూరిత ప్రసంగాలను వినడం,అలవాటుగా ఉండేది.గాంధీజీ నాయకత్వంలో జరిగిన సంపూర్ణ స్వరాజ్య ఉద్యమాలన్ని నిశితంగా గమనించారు. విద్యార్థి దశ నుండే గాంధీజీ (మార్గానికి) అహింసా వాదానికి ఆకర్షితులై 1930లో జరిగిన సత్యాగ్రహోద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు. ఒకవైపు “కులం’ అణిచివేతను అధిగమిస్తూనే భారత స్వాతంత్య్ర పోరాటంలో మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శించి నాటి జాతీయ నాయకుల్ని సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ వాడల నుండి ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో “కులం’ పొరల్ని ఛేదించుకుంటూ రాజకీయాలలో అంచలంచలుగా ఎదిగారు. 1935లో బ్రిటిష్‌ ప్రభుత్వం కల్పించిన పాలనాధికార అవకాశాన్ని, అందిపుచ్చుకొని 27 ఏళ్ల వయసులోనే బీహార్‌ శాసనమండలి సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించి శాసనమండలి సభ్యునిగా, కేంద్రంలో వ్యవసాయ శాఖామంత్రిగా ఆహార శాఖామంత్రిగా, కార్మిక శాఖామంత్రిగా, ఉపాధి పునరావాస మంత్రిగా, రవాణా మంత్రిగా, తంతితపాలా, రైల్వే శాఖా మంత్రిగా ఇంకా కేబినెట్‌ హోదాల్లో పలు పదవులు అలంకరించి ఆ పదవులకే వన్నెతెచ్చిన జగ్జీవన్‌ రామ్‌ అఖండ భారతదేశానికి తొలి దళిత ఉపప్రధానిగా నిజాయితీ, అంకితభావ సేవా తత్పరతలే కవచాలుగా చేసుకొని ఆదర్శప్రాయుడయ్యారు. అందుకే నాటి దేశనాయకులచే “”దేశభక్తుల తరానికి చెందిన మహనీయుడన్న’’ బిరుదు పొందిన జగ్జీవన్‌ రామ్‌ది క్రమశిక్షణతో (కూడిన) మెలిగిన జీవితం. అర్దశతాబ్దం పైగా క్యాబినెట్‌ హోదాలో పలు పదవులు అలంకరించి మచ్చలేని నాయకుడుగా పేరొందిన ఆయన నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలి. బాధ్యతల్ని చిత్తశుద్ధితో, నిబద్ధతగా నిర్వర్తించడమే కాకుండా ప్రశంసార్హంగా మెలగడంలో జగ్జీవన్‌ రామ్‌ నేటి యువతకు ఆదర్శం అయ్యారు. ఇది నేటి యువతకు ఉత్తేజాన్నిస్తుంది. ఘనమైన స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహనీయుల సరసన చేరిన జగ్జీవన్‌ రామ్‌ దార్శనీకత నేటి పాలకులకు లేకపోవడం దురదృష్టకరం. ఆయన ఆదర్శాలను, నిస్వార్ధ రాజకీయ సేవను అమలు చేయడంలోప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఒక అడుగు ముందుకేయడమే జీవితాన్ని దేశ సేవకే అంకితం చేసి నవ భారత నిర్మాణానికి పునాదులు వేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆలోచనలు, ఆదర్శవంతమైన జీవితం చిరస్మరణీయమైనది. అతి పిన్న వయస్సులోనే నెహ్రూ తాత్కాలిక మంత్రివర్గంలో (1946) చేరి “బేబి మినిష్టర్‌’గా పిలవబడ్డ జగ్జీవన్‌ రాం అనతికాలంలోనే తన పరిపాలనా దక్షత, ప్రజలపట్ల ఎనలేని ప్రేమ, నిస్వార్ధ సేవతో అసమాన ప్రతిభ కనబరిచి ఎన్నో ఘన విజయాలు సాధించి తిరుగులేని దేశ నాయకునిగా గుర్తింపుపొందారాని వివరించారు..

110
8165 views

Comment