logo

కేంద్ర బీజేపీ కూటమి సర్కార్ పై కాంగ్రెస్ నిరసన గళం..

ఎం వి పి కాలనీ
విశాఖపట్నం

16 ఏప్రిల్ 2025


మోడీ ప్రభుత్వ రాజకీయ ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ.

ఈ సందర్భంగా ఏపీసీసీ మరియు ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ రోజు బుధవారం ఉదయం 11.30 గంటలకు ఎంవీపి కాలనీ ఈడి కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంలో విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్డాల వెంకట వర్మరాజు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పాల్గొని ఈడి కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేశారు.

ఈ సందర్భంగా
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వం యొక్క తాజా కఠినమైన చర్యలను తీవ్రంగా ఖండించింది జిల్లా కాంగ్రెస్ పార్టీ. నగరంలో గల ఎంవీపి కాలనీ కూడలి వద్ద ఈడి కార్యాలయం వద్ద నిరసన చేపట్టి రోడ్డు పై బైటాయించి ట్రాఫిక్ ను స్తంబింపజేశారు నగర కాంగ్రెస్ నాయకులు.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా పోలీసులు అక్కడ చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.

ముఖ్యంగా, నేషనల్ హెరాల్డ్‌కు చెందిన ఆస్తులను ఏకపక్షంగా మరియు అన్యాయంగా స్వాధీనం చేసుకోవడం మరియు SMT తో సహా సీనియర్ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా రాజకీయంగా ప్రేరేపించబడిన ఛార్జ్‌షీట్‌లను దాఖలు చేయడం
సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ పైన 1938 లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్, భారతీయ స్వేచ్ఛా పోరాటంలో కీలక పాత్ర పోషించింది, బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా శక్తివంతమైన గొంతుకగా పనిచేసింది. ఇది జస్టిస్, లిబర్టీ మరియు ప్రజాస్వామ్య ఆదర్శాల కోసం, విలువల కోసం ఈ రోజు వరకు భారతీయ జాతీయ కాంగ్రెస్‌ మార్గనిర్దేశం చేస్తూనే ఉంది.

అలా పిలువబడే చర్య సాధారణ చట్టపరమైన విధానం కాదు.
ఇది రాష్ట్ర-ప్రాయోజిత నేరం, ఇది చట్ట నియమం-ప్రజాస్వామ్య వ్యతిరేకతను నిశ్శబ్దం చేసే లక్ష్యంతో రాష్ట్ర సంస్థల దుర్వినియోగం.
పాలక వెండెట్టా రాజకీయాలను అనుసరించడంలో అన్ని పరిమితులను దాటింది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బెదిరించడానికి మరియు వేధించడానికి పరిశోధనాత్మక సంస్థలను ఉసి గొలుపుతుంది ఇది చాలా దారుణం దీనిని ఖండిస్తున్నాం అన్నారు జిల్లా డీ సి సి ప్రెసిడెంట్ అడ్డాల వెంకట వర్మ రాజు..తక్షణమే మా జాతీయ నాయకులు సోనియాగాంధీ రాహుల్ గాంధీ లపై పెట్టిన ఈడి కేసులను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్రమైన పరిణామాలు తప్పవని కేంద్రంలో బీజేపీ కూటమి నీ జిల్లా కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు .

ఈ నిరసన కార్యక్రమంలో డి సి సి అధ్యక్షుని తో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ,వేగి వెంకటేష్, గాధం మహేష్, ఇతర కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్, బీసీ సెల్ మైనార్టీ నాయకులు,వార్డు నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

15
3107 views