logo

ప్రభుత్వ కళ్లుగప్పి సంవత్సారాలు తరబడి తప్పించుకు తిరుగుతున్న జిల్లా వైద్య టిబి అధికారి.

జీతం కృష్ణాజిల్లాలో పని గుంటూరు జిల్లాలో.

ప్రభుత్వ కళ్లుగప్పి సంవత్సారాలు తరబడి తప్పించుకు తిరుగుతున్న జిల్లా వైద్య టిబి అధికారి.

నఖిలి బిల్లులతో ప్రభుత్వ ఖజానాను లూటి చేస్తున్న అధికారిపై చర్యలు శూన్యం.

కృష్ణాజిల్లా ప్రధాన కేంద్రమైన మచిలీపట్నంలో హాలు మకాం ఉంటూ జిల్లాలోని ఆసుపత్రులను తనిఖి చేయాల్సిన టిబి జిల్లా అధికారి ఎ. వెంకట్రావు ఈ జిల్లలో చేరినప్పటినుండి ఈయన గుంటూరు నుండి మకాం మార్చలేదు. నిత్యం గుంటూరు జిల్లా తెనాలి వెళ్లి అక్కడే తన సొంత క్లినిక్ లో వైద్య సేవలు అందిస్తున్నాడు. ఈ అధికారి ఎపి 39 యుఈ 1682 వాహనం వినియోగిస్తున్నట్లు రికార్డులలో చూపిస్తున్నారు కాని ఈ వాహనము గుంటూరులో ప్రయివేటు వ్యక్తులు కిరాయికి తిప్పడం గమనార్హం.

ప్రభుత్వ వైద్య శాలలకు వచ్చే రోగులకు ఉచితంగా అందించాల్సిన ఖరీదైన మందులు నిత్యం తెనాలి లోని శ్రీ వెంకట్రావు చెస్ట్ క్లినిక్ కు చేరుతున్నాయని, అక్కడ తనవద్ద చూపించుకున్న రోగులకు మందులను అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు అని తెలుస్తుంది.

ఈ విషయమై కృష్ణాజిల్లా అధికారులకు, రాష్ట్ర అధికారులకు పిర్యాదు చేసినప్పటికీ ఇతనిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం వహిస్తున్నారని పిర్యాధి ఆవేదన వ్యక్తం చేశాడు.

0
166 views