logo

పత్రికా ప్రకటన (17.04.2025) కర్నూల్ జిల్లా... విజిబుల్ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయండి... ... కర్నూల్ జిల్లా

పత్రికా ప్రకటన (17.04.2025)

కర్నూల్ జిల్లా...

విజిబుల్ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయండి...

... కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు

విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ... ఆకస్మిక తనిఖీలు చేపట్టిన కర్నూలు పోలీసులు.

• కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులు, కూడళ్లలో పర్యటించిన … జిల్లా ఎస్పీ.

రాష్ట్ర గౌరవ డిజిపి గారి ఆదేశాలతో ఈరోజు రాత్రి అన్ని ముఖ్యమైన రోడ్ల కూడళ్లలో తనిఖీలు చేపట్టాలని డీజీపీ గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయాలని కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు పోలీసు అధికారులను ఆదేశించారు.

గురువారం జిల్లా ఎస్పీ గారు స్వయంగా కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో పర్యటించారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు , శాంతి భద్రతలను పరిరక్షించేందుకు జిల్లావ్యాప్తంగా పోలీసులు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు.

ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఎస్పీ గారు కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని ఉల్చాల వై రోడ్డు జంక్షన్ ఆకస్మిక తనిఖీ చేశారు.

అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచరింపు, తదితర విషయాలపై ఆరా తీయాలన్నారు.

గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలన్నారు.

ఆయా కాలనీల్లో ప్రజలతో ముఖాముఖి మాట్లాడి స్థానికంగా ఉంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.

ప్రజలతో మమేకం కావడం వల్ల పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంపొందే వీలుంటుందన్నారు

జిల్లా ఎస్పీ గారితో పాటు కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, కర్నూలు పట్టణ సిఐలు మధుసుధన్ గౌడ్, నాగరాజారావు ఉన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.

5
1384 views