logo

తిరుపతి జిల్లా... మెడికో ప్రాణం కాపాడిన రామచంద్ర పురం పోలీసు సిబ్బంది

తిరుపతి జిల్లా...

మెడికో ప్రాణం కాపాడిన రామచంద్ర పురం పోలీసు సిబ్బంది

మెడికో ప్రాణం కాపాడిన పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ గారు.

తమ బిడ్డ ప్రాణం పాడిన తిరుపతి జిల్లా పోలీసుల రుణం తీర్చుకోలేనిదని కుమార్ సంతోషం వ్యక్తం చేసిన కుమార్ (కొన్ని అనివార్య కారణాలు వల్లన మెడికో పేరు మార్చాము) తల్లిదండ్రులు.

రామచంద్రపురం మండలం, రాయల చెరువు,పివిపురం గ్రామాల మధ్యలో గల ప్రాంతంలో కుమార్ (కొన్ని అనివార్యకారణాల వల్లన పేరు మార్చాము) 3rd year మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటానని తన తోటి విద్యార్థులకు ఫోన్ చేసి రామచంద్ర పురం పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది.

సమాచారం వచ్చిన వేంటనే రామచంద్రపురం పోలీసు సిబ్బంది 20 నిమిషాల్లోనే శ్రీ బొడ్డు హేమంత్, ఐపీఎస్ ట్రైనీ సార్ గారు మరియు వారి సిబ్బంది రెండు టీములుగా ఏర్పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థిని వెతికి కేసు చేదించారు.

ఆత్మహత్య చేసుకొవటానికి గల కారణాలను తెలుసుకుని మెడికోకి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

దైర్యంగా ఉంటే ఎలాంటి సమస్యనైన అవలీలగా పరిష్కరించుకొగలమని మెడికోకి పోలీసు సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఎదైన సమస్య ఉంటే స్నేహితులతో కాని, కుటుంబ సభ్యులతో కాని , బందువులతో కాని షేర్ చేసుకుంటే ఆ సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందని ట్రైనింగ్ ఐపిఎస్ అధికారి తన సిబ్బంది తో కలిసి కౌన్సిలింగ్ ఇచ్చారు.

సమాచారం వచ్చిన వేంటనే సకాలంలో స్పందించి రాత్రి సమయంలో పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి .. మెడికో ప్రాణం కాపాడి సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు.

మెడికో విద్యార్థిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మరోసారి ఇలాంటి ఘటన చేసుకోకుండా ఉండే విధంగా చుసుకొవాలని పోలీసు సిబ్బంది మెడికో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.

5
280 views