logo

రేపు జరుగబోయే దళిత హక్కులు సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సుకు అందరూ ఆహ్వానితులే.. మెదక్ మీడియా టుడే స్టాఫ్ రిపోర్టర్, బైండ్ల లక్ష్మణ్,

-ముఖ్యఅతిథిగా జిల్లాఎస్సీ కార్పొరేషన్ డిడి శశికళ.

డి బిఎఫ్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్.

మెదక్ మీడియా టుడే స్టాఫ్ రిపోర్టర్. 18.04.2025:
నిజాంపేట మండల కేంద్రంగా వంజర సంఘం కమ్యూనిటీ హాల్లో జరగబోయే ఏప్రిల్ మాసం మహనీయుల జయంతి ఉత్సవాల్లో భాగంగా దళిత హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సును డి బి ప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందున, ఈ సదస్సుకు జిల్లాఎస్సీ కార్పొరేషన్ డిడి శశికళ మేడం ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు . డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పీ శంకర్ హాజరవుతున్నారు కావున మండలంలో ఆయా గ్రామాలలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువత సదస్సుకు సకాలంలో హాజరై సంక్షేమ పథకాలు హక్కులు
పై అవగాహన చేసుకొంటారని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి బిఎఫ్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ కొమ్మటబాబు, మేకల రమేష్, బ్యాగరి రాజు, తదితరులు పాల్గొన్నారు.

4
1662 views