logo

బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి : విశ్వ హిందూ పరిషత్

నంద్యాల
ఏప్రిల్ - 19 - 2025

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల ముసుగులో పశ్చిమ బెంగాల్ లో హిందువుల పైన జరుగుతున్న దాడులను విశ్వ హిందూ పరిషత్ ఖండించింది.

శనివారం స్థానిక కలెక్టర్ గారిని కలిసి వారి ద్వారా గౌరవ రాష్ట్రపతి గారికి బెంగాల్ లో హిందువులపైన జరుగుతున్న దాడులను అరికట్టే విషయంలో విఫలమైన మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తూ రాష్ట్రపతి పాలన ను విధించి పరిస్థితులను అదుపు చేయాలని విశ్వ హిందూ పరిషత్ దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్ లకు వినతి పత్రాలు సమర్పించిందని వి.హెచ్.పీ జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి తెలిపారు.

రాష్ట్ర ఉపాధ్యక్షుడు యర్రం విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకులు హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రశ్నించాలని అన్నారు , మెజారిటీ హిందూ దేశంలో హిందువులపై అరాచకాలకు మద్దతు తెలుపుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు త్వరలో హిందూ సమాజము చరమ గీతం పాడే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయని అన్నారు.

బెంగాల్ లో దాడులు చేస్తున్న వారందరూ బాంగ్లాదేశ్ నుండి వచ్చిన రోహింగ్యాలే అని , అమాయక ముస్లిం సోదరులను వక్ఫ్ సవరణ పై తప్పు దోవ పట్టిస్తున్న కొన్ని తెగల ముస్లిం అగ్ర నాయకుల దోపిడీ భాగోతం సమాజానికి తెలియకుండా ఇటువంటి దాడులకు , కవ్వింపు చర్యలకు , అనవసర ర్యాలీలకు వీరిని ప్రోత్సహిస్తున్నారని సదరు నాయకులు ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను ప్రజలకు , అమాయక ముస్లిం సోదరులకు వివరించి క్షమాపణ కోరాలని వారు అన్నారు.

వక్ఫ్ సవరణను ముస్లిం సమాజంలో వివక్షకు గురవుతున్న అనేక తెగలకు సంబంధించిన ముస్లిం సోదరులు, మహిళలు స్వాగతిస్తున్నారని వారు ఈ సందర్భముగా గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్ , జిల్లా ఉపాధ్యక్షులు శేష సాయి , చిలుకూరి శ్రీనివాస్ , మేడా మురళి , ఇనుగూరి రమేష్ , రాం ప్రసాద్ , విశ్వ నాథ రెడ్డి , కిరణ్ , నరసింహ వెంకట సుబ్బయ్య , చంద్రశేఖర్ తదితర హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

1
0 views