logo

ఎస్ సి వర్గీకరణ విజయోత్సవ కార్య క్రమం

ఎస్ సి వర్గీకరణ విజయోత్సవ సభ

ఎస్ సి వర్గీకరణ అమలు లోకి వచ్చిన సందర్భంగా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట గ్రామం లో ఎం ఆర్ పి ఎస్ సంఘం నాయకుడు మాత త్రినాధ్ ఆద్వర్యం లో రాజ్యాంగ
నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్,
ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు, ఎం ఆర్ పి ఎస్
వ్యవస్థాపకుడు మందా క్రిష్ణ మాదిగ చిత్ర పటాలకు ఆది వారం
పాలాభి షేకం చేయడం జరిగింది,
ఎస్ సి ( మాదిగ ) వర్గం నాయ కులు, పలువురు ఉపాద్యా యులు, ఉద్యోగులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు,

ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రం లో ఎస్ సి వర్గీకరణ అమలు చేయడం వలన ఎస్ సి లోని అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని అన్నారు, అందుకు కృషి చేసిన మందా క్రిష్ణ మాదిగకు, అమలుకు చొరవ చూపి న ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడుల కు ఋణ పడి ఉంటామని అన్నారు.

0
1804 views