logo

తృప్తి రిసార్ట్స్ అధినేత మురళీ మాస్టర్ బిజెపిలో చేరిక

విజయనగరం జిల్లా, రాజాం పట్టణానికి చెందిన వ్యాపారవేత్త, తృప్తి రిసార్ట్స్ అధినేత పివిజి కృష్ణం రాజు (మురళీ మాష్టారు )భారతీయ జనతా పార్టీలో చేరారు.
జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ సారథ్యంలో ఇటీవల రాజమండ్రి భారతీయ జనతా పార్టీ ప్రదాన కార్యాలయంలో రాష్ట్ర అద్యక్షులు, పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన వెంట విజయనగరం జిల్లా కు చెందన రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, విజయనగరం పార్లమెంటు కన్వీనర్ శంబర లక్ష్మీనరసింహ శర్మ పాల్గొన్నారన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు భారతీయ జనతా పార్టీ భావజాలానికి, పార్టీ బలోపేతానికి రాజాం లో గల కార్యకర్తలతో సమన్వయం చేసుకోగల మంచి నాయకత్వ లక్షణాలు గల వ్యక్తి మురళీ మాస్టర్ అని జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజేష్ వర్మ కొనియాడారు. ఆయన చేరిక విషయం తెలుసుకున్న అభిమానులు, నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పివిజి కృష్ణం రాజు (మురళి మాష్టారు) కు అభినందనలు తెలియజేశారు.

72
3024 views