logo

ధర్మవరంలో ముస్లింల భారీ ర్యాలీ

అనంతపురం (AP): దేశవ్యాప్తంగా ముస్లింలు చేస్తున్న ఆందోళనలో భాగంగా ధర్మవరంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు ధర్మవరం జామియా మసీదు నుండి ఈ ర్యాలీ తేరుబజారు అంజుమన్ సర్కిల్. గాంధీ నగర్ సర్కిల్. పిఆర్టి సర్కిల్. కళా జ్యోతి సర్కిల్. కాలేజీ సర్కిల్ మీదుగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆర్డిఓ గారికి ముస్లిం మత పెద్దలు ధర్మవరం సీనియర్ రాజకీయ నాయకులు అమీర్ భాష. చాంద్ బాషా. సాదిక్ భాషా. ఫయాజ్ భాష. ఏక్ బాల్. జామియా మజీద్ కార్యదర్శి హైదర్ వలీ హజరత్ టిప్పు సుల్తాన్ కమిటీ సభ్యుడు షేక్ షబ్బీర్ ధర్మవరం పట్టణంలోని మసీదు కమిటీ సభ్యులు ముత్తువల్లిలో మౌలానాలో పలువురు ఆర్డిఓకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం 2025 వెనక్కు తీసుకునేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చరిత్రలో ముస్లిం ద్రోహులుగా మిగిలిపోతారని వీరి కారణంగానే పార్లమెంట్లో బిల్లు మంజూరు అయిందని పేర్కొన్నారు ముస్లింల హక్కులకు భంగం కలగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాము బిజెపితో పొత్తు పెట్టుకున్నామని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు అధికారం మత్తులో ముస్లింలకే ఇచ్చిన మాటను మరిచి ముస్లింలకు ద్రోహం చేశాడని వారు విమర్శించారు చంద్రబాబు నాయుడు అబద్ధాల బాబుగా మిగిలిపోతాడని వారి పేర్కొన్నారు తమకు మద్దతు ఇచ్చిన హిందూ క్రైస్తవ సోదరులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని ఈ పోరాటంలో వారు భాగస్వామ్యం కావడం ఆనందించే విషయమని వారు పేర్కొన్నారు భారతదేశంలో మతసామరస్యాన్ని ఎవరు చెడగొట్టలేరని వారు పేర్కొన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చే ప్రతి పిలుపుకు తాము స్పందిస్తామని ధర్మవరం ముస్లిం సోదరులు తెలిపారు.

141
5814 views