
డా "బి ఆర్, అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు, బంగారు పతకాలు,,..!!
AIMA న్యూస్ : ఏప్రిల్ 21:సోమవారం :ఏపీ
న్యూస్ 9:- విశాఖపట్నం జిల్లా శ్రీ కృష్ణ రాయ పురం డా ""బి ఆర్, అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు విజయవాడ లో నిర్వహించిన చిల్డ్రన్స్ ఆర్ట్ క్రాఫ్ట్స్ విభాగంలో బంగారు పతకాలు సాధించి రాష్ట్రము లో మంచి గుర్తుంపు తెచ్చారు. వివరాలు లోకి వెళ్తే.. .
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు కళాశాల శ్రీ కృష్ణాపురం. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్స్ గ్యాలరీ విజయవాడ వాళ్లు నిర్వహించిన ఆర్ట్ మరియు పెయింటింగ్ పోటీలలో
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం శ్రీకృష్ణాపురం విద్యార్థులు పాల్గొని,డ్రాయింగ్ విభాగములో 16 గోల్డ్ మెడల్స్, 12 సిల్వర్ మోడల్స్ సంపాదించారు. మెడల్స్ పొందిన విద్యార్థులకు రోటరీ క్లబ్ సెక్రటరీ శ్రీమతి మని మాల చేతుల మీదుగా బహుకరించడం జరిగినది.
వీళ్లకు కోచింగ్ ఇచ్చినటువంటి ఆర్ట్ టీచర్ పి. సుధాకర్ తర్ఫీది ఇచ్చి ఉన్నారు. తమ విద్యార్థులకు ప్రధమ బహుమతి రావడానికి కృషిచేసిన స్థానిక డ్రాయింగ్ మాస్టారు పి సుధాకర్ కు బెస్ట్ టీచర్ అవార్డు సర్టిఫికెట్ ఇచ్చి దుస్సాలువాతో రోటరీ క్లబ్ సెక్రెటరీ శ్రీమతి మణిమాల సత్కరించిరి.
అనకాపల్లి విశాఖపట్టణం ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త శ్రీమతి ప్రభావతమ్మ మేడం గారు,ప్రిన్సిపాల్ శ్రీమతి రత్నవల్లిగారు,మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది అభినందనలు వ్యక్తపరచరి.
మెడల్స్ పొందిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు తల్లిదండ్రులు కమిటీ చైర్మన్ శ్రీ గంగరాజు, వైస్ చైర్మన్ శ్రీమతి నీలవేణి అభినందనలు వ్యక్తం చేశారు.