logo

ముధోల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రంగస్థల నటుడు, కళాకారునికి ఘనంగా సన్మానం:-



ప్రముఖ రంగస్థలం నటుడు, సినీ నటుడు,మేకప్ ఆర్టిస్ట్, కళాకారుడు బాపనపల్లి వెంకటస్వామి ఈ రోజు ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారి కార్యాలయంలో """"రావణబ్రహ్మ""""ఏకపాత్రాభినయం తో అద్భుతమైన ప్రదర్శన గావించినందున శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ పుష్పగుచ్చమిచ్చి,శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు, సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి, బాసర మండల మాజీ జెడ్పిటిసి సావుండ్లి రమేష్ పలువురు పాల్గొన్నారు.

22
3553 views