పహల్ గామ్ లో 28 మంది అమాయకులు మృతి.
అనంతపురం :పహల్ గామ్ లో నిన్న జరిగిన సంఘటన దేశాన్ని అమితంగా బాధించింది. మినీ స్విజర్లాండ్ గా గుర్తింపు పొందిన ప్రాంతంలో విచ్చలవిడిగా ఉగ్రవాదులు జరిపిన జరిపిన కాల్పుల్లో 28 మంది మృతి చెందారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ఇంజనిర్ గా పని చేసే మధుసూదన్ రావు తన ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లి ఉగ్రవాదుల దాడిలో మృతి చెందారు. ఆయన శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఉగ్రవాదులు పర్యటకులపై ఎంత కిరాతకంగా ప్రవర్తించారన్నది ఈ సంఘటనతో స్పష్టమవుతుంది. మినీ సీజర్ ల్యాండ్ గా పర్యటకుల కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం స్పష్టం అవుతుంది. ఈ సంఘటన యావత్ భారతీయుల్ని వారి హృదయాల్ని కలిసివేసింది. ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలి పాకిస్తాన్ పట్ల భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఉగ్రవాద చర్యలను నిరసిస్తూ ధర్మవరం పట్టణంలో యువర్స్ ఫౌండేషన్ సంస్థ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించింది ఈ ర్యాలీలో కార్యదర్శి జయరాం.పోలా ప్రభాకర్. డాక్టర్ సుబ్బారావు. చాంద్ బాషా. శ్రీనివాస్ డాక్టర్ సికిందర్. ఆంజనేయులు. కేతా లోకేష్. మల్లికార్జున గుప్తా.అరవింద్ .రిటైర్డ్ బిఎస్ఎఫ్ వంక దారిమోహన్ఆయన కుమార్తె వి. గాయత్రి తదితరులు పాల్గొన్నారు.