logo

వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఉర్సా క్లస్టర్స్ ప్రమోటర్ హరీష్ కోయా

వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఉర్సా క్లస్టర్స్ ప్రమోటర్ హరీష్ కోయా

* *విశాఖలో ఏఐ డేటా సెంటర్‌ను పెట్టేందుకు కట్టుబడి ఉన్నాం*
* *అమెరికాలో 28 సంవత్సరాల నుండి అనేక రంగాల్లో పనిచేసిన అనుభవం నాకుంది*
* *మాతృభూమిపై ఉన్న ప్రేమ, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలకు ఆకర్షితులై మేము పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాం*

USA:- గత కొన్ని రోజులుగా ఉర్సా క్లస్టర్స్ పై వైసీపీ, సాక్షి పత్రిక చేస్తున్న ఆరోపణలను ఉర్సా క్లస్టర్స్ ప్రమోటర్ హరీష్ కోయా తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా హరీష్ కోయా వీడియో విడుదల చేశారు. 28 సంవత్సరాల నుంచి ఐటీ, సప్లై చైన్, ఇన్ఫ్రా స్ట్రక్చర్ మేనేజ్మెంట్ రంగాల్లో విజయవంతంగా బిజినెస్‌లను రన్ చేస్తూ $100+ మిలియన్ డాలర్ల నెట్ వర్త్ ఉన్నట్లు హరీష్ కోయా ప్రకటించారు. నా అనుభవంతో ఏఐ రంగంలో కూడా అడుగుపెట్టి అనేకమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని అనుకున్నట్లు తెలిపారు. ఉర్సా సంస్థలో ఐటీ రంగంల్లో ఎంతో అనుభవజ్ఞలైన టీమ్ ఉన్నట్లు ఆయన తెలిపారు. మాతృభూమిపై తమకున్న ప్రేమతో అలానే నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలకు ఆకర్షితులై ఆరుగురు ఎన్నారైలు కలిసి విశాఖలో ఏఐ డేటా సెంటర్‌ను పెట్టేందుకు ముందుకువచ్చినట్లు ఆయన తెలిపారు. సంస్థ యొక్క పూర్వపరాలను చూసి ప్రభుత్వం కూడా ఎంతగానో ప్రోత్సహించినట్లు ఆయన వివరించారు. యువతకు మేలు చేద్దామని మేము వస్తే అనుకోని పరిణామాలు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఉర్సా సంస్థపై అనేక తప్పుడు ఆరోపణలు చేయడం భాధాకరం అని ఆయన అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రెండేళ్ళలో 100 మెగా వాట్ల సామర్ధ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం తమకిచ్చిన నిర్దేశిత సమయంలో కల్లా ప్రాజెక్టును పూర్తి చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు అందిస్తామని వీడియా సందేశం ద్వారా. ఆయన ధీమా వ్యక్తం చేశారు.

0
0 views