logo

డ్రగ్స్,ఆన్లైన్ బెట్టింగ్, మద్యం, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి..

పవర్ న్యూస్ ప్రతినిధి ఆదోని కర్నూలు జిల్లా ఏప్రిల్ 27 : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ)ఆదోని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 29,30 తేదీలలో పట్టణంలో నిర్వహిస్తున్న యువ చైతన్య సైకిల్ యాత్ర పోస్టర్లను ఆదోని డీఎస్పీ హేమలత ఆవిష్కరించారు. అనంతరం డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు వీరేష్, నాయకులు వెంకటేష్,నవీన్, సతీష్,మోహన్, వీరు మాట్లాడుతూ డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, మద్యం, గంజాయి వద్దు మన ఆరోగ్యం ముద్దు అనే నినాదంతో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని యువతను చైతన్యం చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు యువ చైతన్య సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని వారు కోరారు.

1
0 views