logo

వైసిపి నుండి బిజెపి లోకి చేరికలు..పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పార్థసారథి..

పవర్ న్యూస్ ప్రతినిధి ఆదోని కర్నూలు జిల్లా ఏప్రిల్ 27: ఆదోని మండలం పరిధిలోని దొడ్డనకేరి గ్రామం నుండి ఆదివారం వైసీపీ పార్టీకి చెందిన సుందర్ రాజు మరియు వారి 20కుటుంబాలు బిజెపి మండల అధ్యక్షులు బి.ఉషారాజ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమీక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఉషా రాజు మాట్లాడుతూ...గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం సంకల్పం గ్రామాల అభివృద్ధి అని వారికి తెలియపరిచారు ఆదోని అభివృద్ధి కోసం డాక్టర్ పార్థసారధి అనుక్షణం కృషి చేస్తున్నారని కొంతమంది అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో వారికి ప్రజలే బుద్ధి చెబుతారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి భాలముని శేఖర్ ఎస్సీ విభాగం అధ్యక్షులు బి.రాజు,దొడ్డనకేరి గ్రామ బిజెపి నాగరాజు, మునిస్వామి గర్జప్ప, ఈరప్ప, లక్ష్మన్, శేఖర్ యాదవ్, దాసప్ప, గజేంద్ర, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.

1
0 views